ప్రజాపాలన గ్రామ సభలను రెండు రోజులుగా గమనిస్తుంటే ఈ గ్రామ సభలు బోగస్ సభల ఉన్నాయంటూ బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఈ ప్రజాపాలన గ్రామ సభల పేరిట ప్రజలను మోసం చేస్తున్నదని, రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు 6 గ్యారంటీలు 100 రోజుల్లో ఇస్తా అని కాంగ్రెస్ కు ఒట్లేయించుకుని గద్దెనెక్కాక హామీలు విస్మరించారని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. అప్ప్లికేషన్ల పేరిట ప్రజలను జిరాక్స్ సెంటర్ లకు, మీ సేవ సెంటర్ లకు, మండలాఫీసుల చుట్టుత సంవత్సరం పాటు తిప్పుకుంటూ ఒక్క హామీ సక్రమంగా నెరవేర్చటం లేదని ఆయన ఆరోపించారు.
ఎన్నిసార్లు అప్లికేషన్స్ ఇవ్వాలో
ఒకసారి మండల ఆఫీసుల్లో అప్ప్లికేషన్ లు ఇవ్వమన్నాడు, రెండవ సారి ప్రజాపాలన కార్యక్రమంలో అప్ప్లికేషన్ లు ఇవ్వమని, మూడవ సారి ఇంటింటి సర్వే లో చెప్పుమని, తీరా సంవత్సరం గడిచినాక మళ్ళీ నాల్గవసారి గ్రామ సభలల్లో అప్ప్లికేషన్లు ఇవ్వమని అంటున్నట్టు ప్రశాంత్ ఆవేదన వ్యక్తంచేశారు. సంవత్సరం పొడుతా ఇచ్చిన అప్ప్లికేషన్లు ఎటుపోయినయి? ఎక్కడ పడేశారు? అంటూ ఆయన నిలదీశారు. సర్పంచు, ఎంపీటీల ఎన్నికలోస్తున్నాయని…. ప్రజలను మభ్యపెట్టేందుకే ఈ గ్రామ సభల డ్రామా, ఈ ఎన్నికల అయిపోయినంక గ్రామ సభల్లో ఇచ్చిన అప్ప్లికేషన్లు కూడా పడేస్తారా ? అని ప్రశ్నించారు.
గ్రామ సభలు కావు ఉట్టి సభలు
గ్రామ సభలు ఉట్టియేనని కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పినోళ్ళకే ఇండ్లు, రేషన్ కార్డులు వస్తాయి అని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పినోళ్ళకే ఇండ్లు, రేషన్ కార్డులు ఇస్తే ఈ గ్రామ సభలెందుకు ? అధికారుల సర్వే లెందుకు ? అంటూ ప్రశాంత్ అన్నారు. మీ పేరు లబ్ధిదారుల లిస్ట్ లో ఈ గ్రామ సభలోనే పెట్టాలని పట్టు ట్టాలని, అప్పుడే మీకు న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. రెండు రోజులుగా అనేక గ్రామాల్లో లబ్ధిదారులు వారి పేర్లు లిస్ట్ లో లేకపోతే అధికారులను నిలదీస్తున్నారని, మీరు కూడా అడగండి అంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చిన ఆయన ఇలా అడిగేవారికి గ్రామ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారన్నారు.
ఈ మీడియా సమావేశంలో బద్దం ప్రవీణ్ రెడ్డి, నాగధర్ రెడ్డి, దేవేందర్, దోన్ కంటి నర్సయ్య, చౌట్పల్లి రవి, ఆర్మూర్ మహేష్, డొల్ల రాజేశ్వర్, పాక్స్ చైర్మన్ లు మోహన్ రెడ్డి, రాజేశ్వర్, సామ మహిపాల్, రేగుళ్ల రాములు తదితరులు పాల్గొన్నారు.