Wednesday, January 22, 2025
Homeపాలిటిక్స్BRS Dharna: రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే: కేటీఆర్

BRS Dharna: రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే: కేటీఆర్

త్వరలో రైతు ధర్నా

రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే అంటూ భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులుచెరిగారు. రేవంత్ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలు, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతోనే అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు.

- Advertisement -

రాజకీయ ఉద్దేశాలు అస్సలు లేవు

రైతు ఆత్మహత్యలపై వేసిన తమ కమిటీ వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యం లేదన్న కేటీఆర్, కేవలం రైతాంగానికి అండగా నిలబడాలన్న ఆలోచన తప్ప ఇంకేం లేదని వివరించారు కేటీఆర్. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాసంలో సమావేశమైన అధ్యయన కమిటీ తొలి సమావేశం తరువాత మీడియాతో మాట్లాడిన కేటీఆర్, ఆదిలాబాద్ బ్యాంకులో ఆత్మహత్య చేసుకున్న రైతు విషాద ఘటనే ఈ కమిటీ వేయడానికి కారణమని చెప్పారు. బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశం మేరకు ఏర్పాటైన ఈ కమిటీ ఈ నెల 24వ తారీఖు నుంచి పూర్వ ఆదిలాబాద్ జిల్లా నుంచి పని ప్రారంభిస్తుందన్నారు. రాబోయే నెల రోజులపాటు అన్ని జిల్లాలలో అన్ని వర్గాల రైతులను కలిసి రుణమాఫీ ఎంత మేరకు జరిగింది? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది? కరెంటు సరఫరా ఎలా ఉంది? సాగు పరిస్థితి ఎలా ఉంది? మద్దతు ధర దొరకుతుందా? బోనస్ ఏమైంది? కొనుగోలు కేంద్రాలు ఏమయ్యాయి? రైతు వేదికలు పనిచేస్తున్నాయా? వంటి అంశాలను అధ్యయనం చేస్తుందన్నారు.

క్షేత్రస్థాయిలో పరిశీలించి

రైతాంగం ఎదుర్కుంటున్న సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించడంతో పాటు ఆత్మహత్యలకు కారణాలను అధ్యయనం చేసి నివేదికను రూపొందిస్తుందన్నారు. ఆ నివేదికను బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తుందన్నారు. రైతు డిక్లరేషన్ పేరిట రాహుల్ గాంధీ నాయకత్వంలో వరంగల్ వేదికగా రైతులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలను ఇచ్చిందన్నారు కేటీఆర్. 2 లక్షల రుణమాఫీ, 15 వేల రైతు భరోసా, మద్దతు ధర, బోనస్ ఇవ్వడంతో పాటు విస్తారంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేస్తామని చెప్పిన కాంగ్రెస్ హామీలను నమ్మి రైతులు ఆ పార్టీకి అధికారాన్ని అప్పగించారన్నారు. అయితే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ దారుణంగా విఫలమైందన్నారు.

హోం మంత్రి లేక శాంతి భద్రతలు

హోంమంత్రి లేకపోవడంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు పడకేశాయని కేటీఆర్ విమర్శించారు. ప్రజా సమస్యలను పరిష్కరించకుండా ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు బనాయించడం, సోషల్ మీడియా పోస్టులకు భయపడి అరెస్టుల చేసే తాపత్రయం సిఎం రేవంత్ ది అన్నారు. ముఖ్యమంత్రి ప్రాధాన్యం ఫార్ములా కేసైతే, తమ ప్రాధాన్యత ఫార్మర్ అన్నారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా త్వరలోనే నల్లగొండలో రైతు ధర్నా నిర్వహిస్తామన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News