Thursday, January 23, 2025
Homeనేషనల్Davos: దావోస్‌లో ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్, ఫడ్నవీస్

Davos: దావోస్‌లో ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్, ఫడ్నవీస్

దావోస్‌(Davos)లో జరుగుతన్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు(Chandrababu), రేవంత్ రెడ్డి(Revanth Reddy) పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పెట్టుబడులే లక్ష్యంగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతూ బిజీ బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి చంద్రబాబు, రేవంత్ పాల్గొన్నారు. భారత్‌ ఒక యూనిట్‌గా పెట్టుబడులు రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గ్రీన్‌ ఎనర్జీ, ఏఐ, రక్షణ రంగంలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలు చర్చించినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News