మహారాష్ట్ర(Maharashtra)లోని జల్గావ్‌లో ఘోర రైలు ప్రమాదం(Train accident) చోటుచేసుకుంది. పుష్పక్ రైలులో మంటలు వ్యాపిస్తున్నాయనే వదంతులతో చైన్ లాగిన ప్రయాణికులు కిందకి దిగి పక్కనున్న పట్టాలపైకి పరుగెత్తారు. అదే సమయంలో వచ్చిన కర్ణాటక ఎక్స్‌ప్రెస్ రైలు వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. సమాచారం అందుకున్న అధికారులు సహాయ చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Train accident: మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం.. పలువురు మృతి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES