ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య రౌడీలను గొడవ పడకుండా ఆపడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు ఫైటింగ్ జరిగితే వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందని బెదిరిస్తుంది. అప్పుడు నందగోపాల్ మాత్రం వాళ్లు పారిపోతే నేను భయపడతానా, చంపేస్తాను అని రాజ్‌ని కొట్టడానికి వస్తుంటే రాజ్ నందగోపాల్‌ని కొడతాడు. కావ్య రాజ్‌ని ఆపి కాసేపట్లో పోలీసులు వస్తారు వడి పని వాళ్లే చూసుకుంటారు అంటే ఆ నందగాడు పారిపోయే ప్రయత్నం చేస్తాడు. ఇంతలో పోలీసులు వచ్చి నందగోపాల్ ని పట్టుకుంటారు. పోలీసులు నందగోపాల్‌ని తీసుకుని వెళ్తుండగా బైక్‌లో ఒక వ్యక్తి వచ్చి నందాని గన్‌తో షూట్ చేసి వెళ్లిపోతాడు. ఇదంతా చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు. హాస్పిటల్‌కి తీసుకెళ్దాం అనుకునే సరికి అప్పటికే అతను చనిపోతాడు. పోలీసులు రాజ్, కావ్యని అక్కడినుంచి పంపించేస్తాడు.
మరోవైపు రుద్రాణి నేను ఇంత కష్టపడి సాక్ష్యాలు తెచ్చి ఇస్తుంటే నవ్వు వాళ్లని నిలదీయకుండా వదిలేస్తున్నావు. ఇంతలో రాహుల్ అక్కడికి వచ్చి ఈరోజు రాజ్, కావ్యలు అసలు ఆఫీస్‌కి వెళ్లలేదంట అని చెప్తాడు. నేను అనుకున్నదే జరిగింది వాళ్లు ఆఫీస్‌లో ఏదో పని ఉంది అని వెళ్లలేదు కావాలని వెళ్లిపోయారు. అప్పుడు ధాన్యలక్ష్మి మాత్రం నువ్వు చూస్తూ ఉండు సాయంత్రం వాళ్లు వచ్చాక ఎలా దులుపుతానో అంటుంది.
అక్కడ రాజ్, కావ్య ఇలా జరిగిందేంటి ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. వాడు దొరికితే మన సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనుకుంటే వాడు మొత్తానికి పైకి పోయాడు ఏంటి అనుకుంటారు. ఇంట్లో వాళ్లకి ఏమి సమాధానం చెప్పాలి అని అనుకుంటారు, ఇంటికి వచ్చిన రాజ్, కావ్యలను వెటకారంగా వెల్‌కంమ్ చేస్తుంది. టైం దొరికింది కదా అని రుద్రాణి, ధాన్యలక్ష్మి ఓ రెచ్చిపోతారు.
గెస్ట్‌హౌస తాకట్టు ఎందుకు పెట్టారు అని నిలదీస్తారు. ఏం మాట్లాడాలో తెలియక చెప్పాలో తెలియక రాజ్, కావ్య మౌనంగా ఉంటారు. అప్పుడు సుభాష్ వీళ్లు ఇంతలా నిలదీస్తుంటే మాట్లాడరే, అది ఎంత పెద్ద నిజం అయినా సరే చెప్పాల్సిందే అంటాడు. కావ్య ఏమో క్షమించండి నేను ఇప్పుడు నిజం చెప్పలేను అంటుంది. ఆ మాటకు రుద్రాణి, ధాన్యలక్ష్మి మేము పిచ్చి వాళ్ళలా కనిపిస్తున్నామా, అని రెచ్చిపోతారు. వాళ్ల మాటలకు సహించలేక రాజ్ ఏం నిజం కావాలి మీకు నిజం చెప్తే తట్టుకునే శక్తి మీకు ఉందా ఎందుకు నా భార్యను మాటలతో చంపేస్తున్నారు. అసలు ఆ గెస్ట్ హౌస్ ఎందుకు తాకట్టు పెట్టామో తెలుసా అని చెప్పబోతుండగా ఆపండి అని అరుస్తుంది కావ్య. ఏం మాట్లాడుతున్నారు మీరు అని అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.