ఈరోజు ఎపిసోడ్‌లో మీనా వంట చేస్తుంటే బాలు వచ్చి నీకు రాత్రి ఏమి చెప్పాను వంట చేయొద్దని చెప్పాను కదా మళ్లీ ఎందుకు చేస్తున్నావు అంటాడు. ఇంకెవరు చేస్తారు తప్పదు అంటే సరే నీ కర్మ అంటాడు బాలు.సరే నా బాత్రూమ్‌లో సోప్ లేదు అన్నాను పెట్టావా అంటే పెట్టాను తీసుకుని వచ్చి కింద బాత్రూమ్‌లో చేయి అంటుంది మీనా. ఎందుకు అంటే పైన రూమ్ రవి, శృతికి ఇచ్చాము కదా అంటే సరే నీ పని చేసుకో నేను చూసుకుంటా అని గదిలోకి వెళ్తాడు.
గదిలోకి వెళ్లిన బాలు రవిని ఏ రా శోభన్‌బాబు అయిపోయిందా అంటాడు. లగేజ్ తెచ్చి చేతికి ఇచ్చి బయటికి వెళ్లిపోమని గెంటేస్తాడు. ఇంకో సారి ఈ గదిలో కాలు పెడితే చంపేస్తాను అంటాడు. కింద ప్రభావతి ఏమో టిఫిన్ చేయడానికి అందర్నీ పిలుస్తుంది. మనోజ్ వచ్చి నాకు టిఫిన్ పెట్టమ్మా నేను షో రూమ్ కి వెళ్ళాలి అంటే ప్రభావతి కోపంగా చూస్తుంది. ఈలోగా బాలు అక్కడికి వచ్చి మీనాని టిఫిన్ పెట్టమని అడుగుతాడు.
ఏదో ఆఫీస్ పని పోతుందనట్టు ఏంటి ఆ కంగారు డ్రైవింగ్ కే కదా ఎందుకు అంత అంటుంది ప్రభావతి. టఫిన్ తినేసాక మీనాను గదిలోకి రమ్మని చెప్పి వెళ్ళిపోతాడు బాలు. ఈ గదిలో నీకు సంబంధించిన వస్తువులు ఏమైనా ఉన్నాయా అనడంతో బట్టలు తప్ప ఏమి ఉండవు అంటుంది. సరే అవన్ని తీసుకో అంటాడు. అవన్ని పట్టుకుని బయటకు పదా అని చెప్పి గదికి తాళం వేస్తాడు. మళ్లీ తాళం వేసావా అన ప్రభావతి అడుగుతుంది. అప్పుడు బాలు వాళ్లకి ఒక న్యాయం మాకో న్యాయమా, వాళ్లని ఒకలాగ, మమ్మళ్ని ఒకలాగ చూస్తావా అని నిలదీస్తాడు బాలు. మీనా వద్దు అని చెప్పినా వినడు. అలా తాళం వేసి వెళ్లిపోతాడు.
అప్పుడు ప్రభావతి రవిని బాధపడకు అంటుంది. అందరూ వెళ్లిపోయాక నీ కడుపు చల్లారిందా బాగా వాడిని రెచ్చగొట్టావు. ఒక్కరోజు రాత్రి మొగుడు పక్కన లేకపోతే పడుకోలేవా వాడిని కొంగు కట్టేసుకున్నావా అని నానా మాటలు అంటుంది. మీరేం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా అత్తయ్య అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. మరోవైపు రవి లగేజ్‌తో వచ్చి నేను ఇంట్లో ఉండను వెళ్ళిపోతాను నా భార్యకు ఆ మాత్రం షెల్టర్ ఇవ్వలేనా అని అంటాడు రవి. ప్రతి నిమిషం ఇలా బయటికి వెళ్లగొడితే ఎలా, నేను అంటే సర్దుకుంటాను శృతి బయటనుంచి వచ్చింది నేను తనకు అవమానం జరగనివ్వను అంటాడు.
ప్రభావతి ఏమో నేను ఇంత కష్టపడింది వృధానా అంటుంది. వాడు వచ్చాక మాట్లాడుతాను అంటుంది. మీ నాన్న వచ్చాక మాట్లాడుదాం అంటుంది రోహిణి. న కంఠంలో ప్రాణం ఉన్నంత వరకూ నిన్ను బయటికి ఇళ్లరికం అల్లుడిగా పంపించను, నువ్వు పనికి వెళ్లు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఎలాగైనా మీకు రూమ్ సిద్ధం చేస్తాను అని మాట ఇస్తుంది. శృతకి ఏమి చెప్పకు అంటుంది. మళ్లీ మీనాను నీకు ఇప్పుడు బాగుందా అని అంటుంది. మీ మాటలకు నేను ఇందాకే సగం చచ్చిపోయాను ఇంకా అనకండి మీకు ఏమైనా ఉంటే మీ అబ్బాయిని అనుకోండి అంటుంది. డబ్బున్న కోడలు ఇంటికి వచ్చేసరికి కడుపు మంటతో ఇలా చేస్తున్నావు అంటుంది.