Thursday, January 23, 2025
HomeతెలంగాణCrime News: భార్యను ముక్కలుగా నరికి.. కుక్కర్‌లో ఉడికించి.. భర్త ఘాతుకం

Crime News: భార్యను ముక్కలుగా నరికి.. కుక్కర్‌లో ఉడికించి.. భర్త ఘాతుకం

భార్యను ముక్కలుముక్కులుగా నరికి చంపిన దారుణ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. విచక్షణరహితంగా నరికి చంపిన భర్త సాక్ష్యాలు దొరకకుండా ఏకంగా ముక్కలను కుక్కర్‌లో ఉడికించాడు. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఏపీలోని ప్రకాశం జిల్లాలో రాచర్ల మండలానికి చెందిన గురుమూర్తి, వెంకటమాధవి దంపతులు కొంతకాంలగా హైదరాబాద్‌(Hyderabad)లోని మీర్‌పేట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. గురుమూర్తి ఆర్మీ జవాన్‌గా పనిచేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. ప్రస్తుతం కంచన్‌బాగ్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు.

- Advertisement -

తన భార్యపై అనుమానంతో తరుచూ గొడవ పడేవాడు. ఈనెల 16న మరో గొడవ తలెత్తడంతో భార్యను(Crime News) చంపేశాడు. అనంతరం ఆమె శరీరాన్ని మటన్ కత్తితో ముక్కలు ముక్కలుగా నరికాడు. ఎముకల నుంచి మాంసాన్ని వేరుచేసి ఇంట్లోని కుక్కర్‌లో ఉడికించాడు. ఆ తరువాత ఎముకలను కాల్చి పొడిని చేశాడు. కుక్కర్‌లో ఉడికించిన ముక్కలను డ్రైనేజీల్లో పడేసి, ఎముకల బూడిదను మీర్‌పేట చందచెరువులో కలిపాడు. అనంతరం తన భార్య కనిపించడం లేదంటూ అత్తమామలకు ఫోన్ చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.

దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విచారణలో విస్తుపోయే నిజాలు తెలిశాయి. సీసీ కెమెరాల ఆధారంగా భర్త గురుమూర్తే నిందితుడని గుర్తించారు. దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్యచేసినట్లు ఒప్పుకున్నాడు. కాగా భార్యను చంపడానికి ముందు ఓ కుక్కను చంపి ఇదేవిధంగా ప్రాక్టీస్ చేశాడు. అయితే భర్త గురుమూర్తి నేరం చేశాడని నిరూపించేందుకు సాక్ష్యాధారాలు దొరకడం లేదు. దీంతో ఈ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News