Thursday, January 23, 2025
Homeఆంధ్రప్రదేశ్AP DGP: ఏపీకి కొత్త పోలీస్ బాస్ ఎవరు..?

AP DGP: ఏపీకి కొత్త పోలీస్ బాస్ ఎవరు..?

ఏపీకి కొత్త పోలీస్ బాస్ ఎవరనే ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం డీజీపీ(DGP)గా విధులు నిర్వర్తిస్తున్న ద్వారకా తిరుమలరావు ఈనెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నూతన డీజీపీ ఎవరనే చర్చ మొదలైంది. ప్రస్తుతం సీనియారిటీ జాబితా ప్రకారం చూస్తే మాదిరెడ్డి ప్రతాప్ తొలి స్థానంలో ఉన్నారు. 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ఆయన అగ్నిమాపక శాఖ డీజీగా బాధ్యతలు చూస్తున్నారు. ఇక విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్మెంట్ విభాగం డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన హరీశ్‌ కుమార్ గుప్తా(Harish Kumar Gupta) తర్వాతి స్థానంలో ఉన్నారు.

- Advertisement -

అయితే వీరిద్దరిలో హరీశ్‌ కుమార్ గుప్తానే నూతన డీజీపీగా నియమితులయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఆయన సార్వత్రిక ఎన్నికల సమయంలో కొన్ని రోజుల పాటు డీజీపీగా బాధ్యతలు నిర్వహించారు. దీంతో ఆయన వైపే సీఎం చంద్రబాబు మొగ్గు చూపే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు.. ఆర్టీసీ ఎండీగా కూడా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నందున పదవీ విరమణ తర్వాత ఆయనను ఇదే పోస్టులో కొనసాగించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News