పెట్టుబడులే లక్ష్యంగా దావోస్ లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బృందం దూసుకుపోతోంది. దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతూ భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకున్నాయి. ఈ కంపెనీల ద్వారా రూ.1.32లక్షల కోట్ల పెట్టుబడులు రానుండగా.. 46వేల మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉంది. గతేడాది కంటే ఈసారి తెలంగాణకు మూడింతలు పెట్టుబడులు పెరగడం విశేషం.
పెట్టుబడులు పెట్టనున్న సంస్థలు ఇవే..
అమెజాన్ వెబ్ సర్వీసెస్ – రూ.60 వేల కోట్లు
సన్ పెట్రో కెమికల్స్- రూ.45,500 కోట్లు
మేఘా ఇంజినీరింగ్- రూ.15 వేల కోట్లు
టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్-రూ.15వేల కోట్లు
హెచ్‌సీఎల్ – రూ.10 వేల కోట్లు
జేఎస్‌డబ్ల్యూ – రూ.800 కోట్లు
విప్రో – రూ.750 కోట్లు
ఇన్ఫోసిస్- రూ.750 కోట్లు
స్కైరూట్ ఏరోస్పేస్- రూ.500 కోట్లు