Thursday, January 23, 2025
Homeటెక్ ప్లస్Recharge Plans: గుడ్ న్యూస్.. జియో, ఎయిర్‌టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్స్‌

Recharge Plans: గుడ్ న్యూస్.. జియో, ఎయిర్‌టెల్ కొత్త రీఛార్జ్ ప్లాన్స్‌

కేవ‌లం వాయిస్‌, ఎస్సెమ్మెస్‌ల కోస‌మే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI) ఆదేశాల మేర‌కు జియో(JIO), ఎయిర్‌టెల్(Airtel) త‌మ వినియోగ‌దారుల కోసం కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకువ‌చ్చాయి. వీటి ద్వారా ఫీచర్ ఫోన్ వినియోగదారులతో పాటు రెండు సిమ్‌లను ఉపయోగించే వారికి కూడా ప్రయోజనం చేకూరనుంది.

- Advertisement -

జియో ప్లాన్‌లు..

84 రోజులు వ్యాలిడిటీతో రూ.458 ప్లాన్ తీసుకొచ్చింది. ఇందులో ఉచిత అపరిమిత కాలింగ్‌తో పాటు 1,000 ఉచిత ఎస్సెమ్మెస్‌లను పొంద‌వ‌చ్చు. అలాగే జియో సినిమా, జియో టీవీ యాప్‌లకు యాక్సెస్ అందుబాటులో ఉంటుంది. మొబైల్ డేటా ఉండ‌దు. అలాగే 365రోజుల వ్యాలిడిటీతో రూ.1,958 ప్లాన్‌లో ఉచిత అపరిమిత కాలింగ్, 3,600 ఎస్సెమ్మెస్‌లు ల‌భిస్తాయి.

ఎయిర్‌టెల్ ప్లాన్‌లు..

రూ. 509 ప్లాన్‌లో 84 రోజుల పాటు అపరిమిత కాలింగ్, 900 ఎస్సెమ్మెస్‌లను అందిస్తోంది. ఇక రూ. 1,999 ప్లాన్‌లో 365రోజుల వ్యాలిడిటీతో అపరిమిత కాలింగ్, 3,600 ఎస్సెమ్మెస్‌లు అందించనుంది. ఈ రెండు ప్లాన్లలో మొబైల్ డేటా అందుబాటులో ఉండదు. కాగా 2024 డిసెంబర్ 23న ఓన్లీ వాయిస్ రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకురావాలని ట్రాయ్‌ అన్ని టెలికాం కంపెనీలను ఆదేశించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News