Thursday, January 23, 2025
HomeతెలంగాణKavitha: సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ

Kavitha: సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బహిరంగ లేఖ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) బహిరంగ లేఖ రాశారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే కులగణన పూర్తి చేసి రిజర్వేషన్లను పెంచుతామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇంకా అమలు చేయలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి ఇంకెంతకాలం తాత్సారం చేస్తారని ప్రశ్నించారు.

- Advertisement -

బీసీ గణనను అశాస్త్రీయంగా నిర్వహించారని, డెడికేటెడ్ కమిషన్ పేరిట కాలయాపన చేసే ఆలోచన కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీసీలు అంటే చులకన ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రంలో గ్రామపంచాయతీల పదవీకాలం ముగిసి దాదాపు ఏడాది అవుతోందని, మండల, జిల్లా పరిషత్‌ల పదవీకాలం కూడా ముగిసిందన్నారు. కానీ రిజర్వేషన్లను పెంచి ఎన్నికలను నిర్వహించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని విమర్శించారు. బీసీలకు ఇచ్చిన హామీ మేరకు రిజర్వేషన్లను 42 శాతం పెంచాల్సిందే అని ఆమె డిమాండ్ చేశారు.

బీసీలకు ప్రతి సంవత్సరం రూ.20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారని.. అయితే గత బడ్జెట్‌లో మాత్రం అరకొర కేటాయింపులు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల బీసీ వర్గాల్లో ఏమాత్రం విశ్వాసం లేదని విమర్శించారు. ఈ వైఖరితో రాష్ట్రంలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందని విమర్శించారు. కుంటిసాకులు చెప్పి ఇచ్చిన మాట కంటే తక్కువ రిజర్వేషన్లు కల్పిస్తే మాత్రం తెలంగాణ సమాజం మిమ్మల్ని సహించబోదని, బీసీల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీ మీ మెడలు వంచి హామీని అమలు చేయించుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News