ఈరోజు ఎపిసోడ్‌లో ప్రభావతి మీనాను తిడుతూ ఉంటుంది. అత్తగారి మాటలకు మీనా చాలా బాధపడుతుంది. మనోజ్ మాత్రం ఈ గొడవలు అన్ని కలిపి తిరిగి మన రూమ్ అడుగుతారు ఏమో అని కంగారు పడతాడు. మీనా బాలుకి ఎన్ని సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయడు. బాలు ఫ్రెండ్ ఎందుకు చెల్లి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే జరిగింది చెప్తాడు బాలు. మా నాన్నను కష్టపెట్టిన ఎవరినైనా నేను క్షమించను అంటాడు. నా కోసం మీనాను కుడా ఇబ్బంది పెడుతున్నారు అందుకే రేపటి దాక ఇంటికి వెళ్లను అప్పుడే వాళ్లకు తెలుస్తుంది అంటాడు.
మరోవైపు శృతి డబ్బింగ్ పూర్తిచేసుకుని బయటికి వచ్చేసరికి రవి ఉంటాడు, ఏంటి ఇక్కడికి వచ్చావు అంటే మనం ట్రిప్‌కి వెళ్దాం పదా అని శృతిని ఇంటికి తీసుకెళ్లకుండా ఉండాలని అనుకుంటాడు. మొత్తానికి శృతి అడగగా ఇంట్లో జరిగిన విషయం చెప్తాడు. తిడుతాది అనుకుంటే శృతి ఏమో పద ఇంటికి వెళ్దాం అని రవిని ఇంటికి తీసుకెళ్తుంది. అక్కడ ఇంట్లో ప్రభావతి మళ్లీ మీనా దగ్గరికి వచ్చి ఇష్టం వచ్చినట్టు తిడుతుంది కుడా ప్రతి మాటకు సమాధానం ఇస్తుంది తన బాధను బయటపెట్టుకుంటుంది. ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు ఏమి చేయమంటారు అంటుంది మీనా. సాయంత్రం లోగా గది తలుపు తీయకపోతే రవితో పాటు నువ్వు బయటికి పోతావు అంటుంది. సరే గెంటేయండి ఏదొక కూలి పని చేసుకుని బతుకుతాను అంటుంది.
ఈలోగా ఫోన్లు చేయగా చేయగా బాలు లిఫ్ట్ చేస్తాడు మీనా ఇంటికి రమ్మని గట్టిగా అరిస్తే మీరు ఇప్పుడు ఇంటికి రాకపోతే నేను ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అంటే బాలు ఇంటికి వస్తాడు. ఇంట్లోకి రాగానే ప్రభావతి ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. మనోజ్, రోహిణి లు కుడా ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక నోరు మూసుకుంటారు వాళ్లు అందరూ. మీనా ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావని బాలు అడుగుతాడు, ఎంతగా అడిగినా మీనా సమాధానం చెప్పదు.