ఈరోజు ఎపిసోడ్‌లో దీప శౌర్యతో మాట్లాడాలని ఏడుస్తుంటే కార్తిక్ నా మీద నమ్మకం లేకపోతే నువ్వే ఫోన్ చేసి కనుక్కో అంటాడు ఇంకా ఆ మాటలకు దీప సరే బాబు శౌర్య తినేసి పడుకుని ఉంటుందిలే రండి మీరు భోజనం తినండి అంటుంది. నేను ఒక్కడినే కాదు అందరం కలిసి తిందాం అని అందరూ కలిసి తింటారు. తర్వాత హాస్పిటల్ నుంచి మిగతా బిల్ అమౌంట్ ఎప్పుడు కడతారు పేమెంట్ కట్టకుండా ఆపరేషన్ చేయము అని ఫోన్ చేసి అడిగితే కట్టేస్తాను అంటాడు.అప్పుడే దీప వచ్చి అడిగినా వేరే ఏదో పని అని ఉంది రెస్టారెంట్ కోసం అని మాట మారుస్తాడు. అనసూయ వచ్చి శౌర్య ఎలా ఉంది ఏమైంది అని అడుగుతుంది బానే ఉంది అని తప్పించుకుంటాడు.
తర్వాత కార్తీక్ వడ్డీ వ్యాపారి దగ్గరకు వెళ్లి రూ.45 లక్షలు కావాలి అని అడుగుతాడు. ఎంతైనా ఇస్తాను కానీ తాకట్టు పెట్టడానికి ఏం తెచ్చావు అంటాడు. తాకట్టు పెట్టడానికి ఏం లేదు అన్నా కానీ టైమ్‌కి వడ్డీ కట్టేస్తాను అంటే ఆ వడ్డీ వ్యాపారి ఇవ్వను అనేస్తాడు. అలా ఆలోచిస్తూ హాస్పిటల్‌కు వెళ్లి శౌర్యను చూసి బాధపడతాడు. కాశీ వచ్చి డబ్బులు అరేంజ్ అయ్యాయా అని అడుగుతాడు. లేదు నా ప్రయత్నం మాత్రం ఆపను ఎలా అయినా డబ్బు సర్దుతాను అంటాడు. డబ్బులు ఎవరిని అడిగినా ఇవ్వట్లేదని ఎలా తీసుకురావాలి, ఆపరేషన్ ఎలా చేయించాలని గట్టిగా అరుస్తూ బాధపడుతూ ఒక చోటా దేవుడా దారి చూపించు అని అడుగుతాడు.
మరోవైపు కాంచన కార్తిక్ కోసం ఎదురు చూస్తూ బయట నుంచి వస్తున్న కొడుకుని చూసి శౌర్య ఏ హాస్పిటల్‌లో ఉంది? ఎలా ఉంది అని ఆరాతీస్తే కార్తిక్ ఇంక ఏడుపు ఆపుకోలేక ఏడ్చేస్తాడు. జరిగిన విషయం అంతా చెప్తాడు ఆపరేషన్ కోసం రూ.50 లక్షలు కావాలని చెప్తే ఇంట్లో వాళ్లు కంగారు పడతారు. ముగ్గురూ మాట్లాడుకుంటూ బాధపడుతుంటే ఈలోగా అక్కడికి దీప వస్తుంది. దీప అడగటంతో సమాధానం చెప్పలేక డబ్బు కూలం ఇబ్బంది పడుతున్నాడు అని మాట మార్చేస్తాడు. శౌర్యను ఎందుకు ఫ్రెండ్ ఇంట్లో పెట్టారు అన్నా దేనికి సమాధానం చెప్పట్లేదు అని అడుగుతుంది. ఎలా అయినా శౌర్యను కాపాడుకోవాలని కాంచన అనసూయ అనుకుంటారు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.