దావోస్(Davos) పర్యటన ముగించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) హైదరాబాద్ చేరుకున్నారు. దుబాయ్ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. సింగపూర్, దావోస్ పర్యటనలను విజయవంతంగా ముగించుకుని రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకొచ్చారంటూ కొనియాడారు. స్వాగతం పలికిన వారిలో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మల్ రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్, రామ్మోహన్ రెడ్డి ఉన్నారు.
- Advertisement -
కాగా దావోస్‌లో మొత్తం 20 సంస్థలతో రూ.1,78,950 కోట్ల పెట్టుబడులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. గతేడాది కంటే ఈసారి నాలుగు రెట్లు అదనంగా పెట్టుబడులు పెరిగాయి. తాజా పెట్టుబడులతో దాదాపుగా 50వేల ఉద్యోగాలు రానున్నాయి.