Friday, January 24, 2025
Homeచిత్ర ప్రభDil Raju: దిల్ రాజు నివాసంలో కొనసాగుతున్న ఐటీ సోదాలు

Dil Raju: దిల్ రాజు నివాసంలో కొనసాగుతున్న ఐటీ సోదాలు

తెలంగాణ ఎఫ్‌డీసీ ఛైర్మన్,‌ ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు(Dil Raju) నివాసంలో నాలుగో రోజూ ఐటీ అధికారుల సోదాలు(IT Raids) కొనసాగుతున్నాయి. ఓ మహిళా అధికారి ఆధ్వర్యంలో తనిఖీలు జరుగుతున్నాయి. దిల్‌ రాజు నివాసం, కార్యాలయాల్లో మంగళవారం నుంచి సోదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపులకు సంబంధించిన పలు కీలక పత్రాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరోవైపు ఆయన సోదరుడు శిరీశ్‌ నివాసంలో సోదాలు ముగిశాయి.

- Advertisement -

కాగా హైదరాబాద్‌లోని సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో గత మూడు రోజులుగా సోదాలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్(Sukumar), మైత్రీ మూవీస్, మ్యాంగో మీడియా, వృద్ధి సినిమాస్, ఏషియన్ సినిమాస్, ఇతర నిర్మాతల కార్యాలయాల్లోనూ అధికారులు సోదాలు నిర్వహించారు. నిర్మాణ సంస్థల ఆదాయం, పన్ను చెల్లింపు మధ్య తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పలు సంస్థలకు చెందిన వ్యాపార లావాదేవీల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు లాకర్లు కూడా పరిశీలించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News