భార్య వెంకట మాధవిని భర్త గురుమూర్తి అత్యంత క్రూరంగా చంపిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జెపి చెరువు గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి గురుమూర్తి భార్య వెంకట మాధవిని కిరాతకంగా హతమార్చిన ఈ కేసును ఛేదించేందుకు పోలీసులకు పెను సవాల్ గా మారింది. నేను చంపాను.. అయితే మీ వద్ద సాక్షాలున్నాయా..? అని పోలీసులను నిలదీసినట్లు సమాచారం. ఆ ఆధారాలుంటే కేసు పెట్టి రిమాండ్ చేయండని.. అంతా కోర్టులోనే చూసుకుంటాా అని సవాల్ విసిరినట్లు సమాచారం.
పోలీసులకు ఈ ఘటన పెద్ద ఆలోచనలోనే పడేసినట్లు తెలుస్తుంది. నిజంగానే గురుమూర్తి భార్యను ముక్కలు, ముక్కలుగా నరికాడా..? అయితే ఇంట్లో రక్తపు మరకలు లేకపోవడం, వాసన కూడా రాకపోవటం వారిని అయోమయానికి గురి చేస్తోంది. లేదా తమను గురుమూర్తి తప్పుదోవ పట్టిస్తున్నాడా అని ఆలోచనలో పోలీసులు పడ్డారు.
ఈ దారుణ సంఘటన తెలంగాణలో రంగారెడ్డి జిల్లా మీర్ పేట పరిధిలో పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కూతురు కనిపించకపోవడం మాధవి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.