చాలామంది అల్లం వాటర్‌ని వారి రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటారు. అల్లాన్ని ఎక్కువగా మసాలా వంటకాలకు ఉపయోగిస్తారు. అలాగే, అల్లం టీ తాగడమూ ఇలా అన్నిటిలో అల్లం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. కానీ ఆయుర్వేదం ప్రకారం అల్లం ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. అల్లం నీటిలో వేసి మరిగించి, ప్రతి రోజూ ఉదయం పరగడుపునే తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
గుండె ఆరోగ్యం: అల్లంలో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. రక్తపోటు తగ్గిస్తుంది. ఈ విధంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది, గుండెపోటు సమస్యలను నివారించవచ్చు. అల్లం నీళ్లు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి, తద్వారా హార్ట్ అటాక్ వంటి ప్రమాదాలు అడ్డుకోవచ్చు.
చర్మ ఆరోగ్యం: అల్లం చర్మం మీద ఎంతో మంచి ప్రభావం చూపిస్తుంది. అల్లం నీళ్లు రోజూ తాగడం వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గిపోతాయి. ముఖం మీద ఉన్న ముడతలు, మచ్చలు తగ్గి, చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
జీర్ణవ్యవస్థకు: అల్లం జీర్ణవ్యవస్థకు ఎంతో ఉపయోగకరమైనది. దీన్ని ప్రతిరోజూ తాగడం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది, అజీర్తి తగ్గుతుంది. గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. కడుపులో మంటలు తగ్గుతాయి, వికారం, వాంతి వంటి సమస్యలు తగ్గిపోతాయి. అల్లంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీని వలన సీజనల్ వ్యాధులు, దగ్గు, జలుబు వంటి సమస్యలు తగ్గిపోతాయి. అల్లం నీళ్లు రోజూ తాగడం వలన ఫ్రీ ర్యాడికల్స్ ను నశింపజేస్తాయి, ఇది శరీరంలోని కణాలను రక్షిస్తుంది. హార్ట్‌అటాక్, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.