తెలంగాణలో రైతు రుణమాఫీ సంపూర్ణంగా జరగలేదన్న మంత్రి దామోదర రాజనర్సింహ(Damodar Rajanarasimha)వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి సవాల్ విసిరారు.
“ముక్కు నేలకు రాయాల్సింది ఎవరో..పదవులకు రాజీనామా చేయాల్సింది ఎవరో.. సన్నాసులు ఎవరో..సమర్థులు ఎవరో..అబద్దాలు చెబుతున్నది ఎవరో.. నిజాలు మాట్లాడుతున్నది ఎవరో..మేము కాదు.. మీ మంత్రివర్గ సహచరుడే చెబుతున్నాడు. రైతు రుణమాఫీపై నువ్వు చెప్పింది శుద్ధ అబద్దమని స్పష్టమైందని..మరి సీఎం రేవంత్ రెడ్డి కొండారెడ్డిపల్లిలో లేదా కొడంగల్‌లో ముక్కు నేలకు రాసి రైతాంగానికి క్షమాపణలు చెప్తావా!? రైతు డిక్లరేషన్ ఓ బూటకం..సంపూర్ణ రైతు రుణమాఫీ పచ్చి అబద్దం..కాంగ్రెస్ పాలన తెలంగాణ రైతాంగానికి ముమ్మాటికీ శాపం” అంటూ కేటీఆర్ మండిపడ్డారు.