Friday, January 24, 2025
Homeచిత్ర ప్రభMass Jathara: రవన్న మాస్ దావత్ షురూ.. అదిరిపోయిన పోస్టర్

Mass Jathara: రవన్న మాస్ దావత్ షురూ.. అదిరిపోయిన పోస్టర్

మాస్ మహారాజా అభిమానులకు అదిరిపోయే న్యూస్ వచ్చేసింది. రవితేజ(Ravi Teja) 75వ చిత్రం ‘మాస్ జాతర’(Mass Jathara) నుంచి గ్లింప్స్ రాబోతున్నట్లు ఓ పోస్టర్ విడుదల చేశారు. రవి పుట్టినరోజు సందర్భంగా సందర్భంగా జనవరి 26న ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ పోస్టర్‌లో భోజనం చేసేందుకు కూర్చుని కోర మీసం మెలేస్తూ రవితేజ్ పవర్‌ఫుల్‌గా కనిపించారు. ఈ పోస్టర్ అభిమానుల్లో అంచనాలు పెంచుతోంది.

- Advertisement -

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ‘సామజవరగమన’ సినిమా రచయిత భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక యూత్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి కానుకగా మే9న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 2022లో వచ్చిన ‘ధమాకా’ మూవీలో రవితేజ, శ్రీలీల జోడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సినిమాతో అదే మ్యాజిక్ రిపీట్ చేయాలని చూస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల రవితేజ నుంచి వచ్చిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. దీంతో తన కెరీర్‌లోనే మైలురాయి అయిన 75వ చిత్రంతో బ్లాక్‌బాస్టర్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. మరి ఈ సినిమాతోనైనా రవితేజ మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News