మంత్రి సీతక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంత్రిగా ఆమె ఎప్పుడూ బిజీ రొటీన్ లో ఉంటారు. ప్రతి నిమిషం ప్రజల కోసం పరితపిస్తూ పనిచేస్తుండే సీతక్క, ప్రయాణంలోనూ అధికార పనిలో పూర్తిగా నిమగ్నమై విధులు నిర్వహిస్తారు.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగుల ఆన్లైన్ గ్రీవెన్స్ సమావేశానికి ఆన్లైన్లో హాజరైన మంత్రి సీతక్క, సచివాలయం నుంచి సమావేశానికి హాజరు కావల్సిఉన్నా, ములుగులో గవర్నర్ పర్యటన నేపథ్యంలో ములుగు బయలుదేరిన సీతక్క, ప్రయాణంలోనే ఉద్యోగుల సర్వీస్ సమస్యలు వినటం విశేషం. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు దిశా నిర్దేశం చేసిన సీతక్క, పి ఆర్ ఆర్ డీ శాఖలో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వినూత్న పద్ధతిని అవలంభిస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగిస్తూ సమస్యలపై ఎప్పటికప్పుడు రివ్యూ చేసి, పరిష్కారాలను సూచిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్న సీతక్క ఇటు అధికారులు అటు ప్రజలతో శెభాష్ అనిపించుకుంటున్నారు.