- Advertisement -
కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన మోనాలిసాకు ఇబ్బందులు తప్పటం లేదు. దీంతో ఈ అమ్మాయి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. నిన్న కొందరు దుండగులు మోనాలిసాను వెంటపడి ఇబ్బంది పెట్టడంతో ఆమె ఇండోర్ వెళ్లిపోయింది. ప్రయాగ్ రాజ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మోనాలిసా పూసల దండలు అమ్మేందుకే ఇక్కడకు వచ్చానని, తన వల్ల మహా కుంభమేళా డిస్టర్బ్ అవుతోందని ఆమె ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన వల్ల తన కుటుంబం ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఊరికి వెళ్లిపోతున్నా అంటూ ఆమె వీడియోలో చెప్పారు.