ఐసీసీ(ICC) తాజాగా ప్రకటించిన వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్-2024(ODI Team Of The Year-2024) క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎందుకంటే ఈ జట్టులో ఒక్క భారత ఆటగాడు లేడు. అంతేకాకుండా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్ల ఆటగాళ్లకు ప్లేస్ దక్కలేదు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ జట్టుకు సారథిగా శ్రీలంక కెప్టెన్ చరిత్ అసలంకను సారథిగా చేయడం. 11 మంది ఆటగాళ్లలో 10 మంది ఆసియా ఉపఖండంకు చెందిన ఆటగాళ్లే ఉండటం గమనార్హం. వెస్టిండీస్ ప్లేయర్ రూథర్ఫర్డ్ ఒక్కడే ఇతర ఖండాల నుంచి చోటు దక్కించుకున్నాడు. దీంతో ఇదేం జట్టు ఎంపికరా బాబు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్-2024…
చరిత్ అసలంక (కెప్టెన్)- శ్రీలంక
సయామ్ అయూబ్- పాకిస్థాన్
రహ్మనుల్లా గుర్బాజ్- ఆఫ్ఘనిస్థాన్
పత్తుమ్ నిస్సాంక- శ్రీలంక
కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్)- శ్రీలంక
రూథర్ ఫర్డ్- వెస్టిండీస్
అజ్మతుల్లా ఒమర్జాయ్- ఆఫ్ఘనిస్థాన్
వనిందు హసరంగ- శ్రీలంక
షహీన్ షా అఫ్రిది- పాకిస్థాన్
హరీస్ రవూఫ్- పాకిస్థాన్
అల్లా మహ్మద్ ఘజన్ ఫర్- ఆఫ్ఘనిస్థాన్