ఈరోజు ఎపిసోడ్లో కార్తిక్ హాస్పిటల్కి వచ్చేసరికి శౌర్య అక్కడ ఉండదు, నర్సులు పాప ఎక్కడికి వెళ్లిందో తెలియదు అంటారు. అప్పుడు కార్తిక్ వాళ్ల మీద సీరియస్ అయ్యి పోలీస్ కేసు పెడుతానని అంటాడు. డాక్టర్ వచ్చి ఏమి కాదు ఇక్కడే ఎక్కడో ఉంటుంది అంటాడు. అందరూ వెళ్లి వెతుకుతుంటే శౌర్య హాస్పిటల్లో కనిపిస్తుంది. కార్తిక్ అప్పుడు కొంచెం రిలాక్స్ అవుతాడు. ఎక్కడికి వెళ్లావు అంటే రేపు నాకు హాస్పిటల్లో పెద్ద పరీక్ష అంట కదా పాస్ అవ్వాలి అని దేవుడు దగ్గర కోరుకుందామని వెళ్లాను అంటుంది.
మరోవైపు జోత్స్న దాసు కోసం ఆలోచిస్తుంటే వెనకాల దశరథ జోత్స్న ఏమి ఆలోచిస్తుందా అని అనుమానిస్తాడు. దాసు పోవాలని జోత్స్న, బతకాలని దశరథ కోరుకుంటారు. ఈలోపు అక్కడికి కాంచన వస్తుంది. ఇంట్లో అందరూ ఆప్యాయంగా పలకరిస్తారు. కాంచన ఇక్కడికి సాయం కోసం వచ్చానని చెప్పి శివన్నారయణను అడుగుతుంది. ఈలోగా శివన్నారయణ వచ్చి ఎవరమ్మా నువ్వు ఇలా వచ్చావు, వెళ్లే ముందు నా కొడుకు ఇష్టమే నా ఇష్టం అన్నావు ఇప్పుడేమైంది వచ్చావు, అవసరానికి తప్ప దేనికి పనికరాము కదా మేము అంటాడు. మీ సహాయం కావాలి నాన్న అని ఏడుస్తూ అడుగుతుంది. అప్పుడు గట్టిగా శివన్నారయణ నవ్వుతాడు.
మొత్తానికి నాకు రూ.45 లక్షలు కావాలి అని కాంచన అడుగుతుంది. మరి కార్తిక్ ఏడి వాడికి తెలియదా వాడి కోసం పెట్టుబడి నేనే ఇవ్వాలా అంటాడు. కార్తిక్ కోసం కాదు అని అంటుంది. శౌర్య కోసం అడుగుతున్నాను అని దానికి గుండె జబ్బు వచ్చింది ఆపరేషన్ చేయకపోతే చనిపోతుంది అంటుంది. అప్పుడు శివన్నారయణ అయ్యో పాపం చంటిదానికి బాలేదా అంటాడు. శౌర్యకు ఒంట్లో బాగోకపోతే నువ్వు కాదు దీప రావాలి అంటుంది జోత్స్న. డబ్బుల కోసం బిడ్డలని అడ్డుపెట్టుకుని నాటకాలు ఆడుతున్నారు అంటుంది. జోత్స్న ఎక్కువ మాట్లాడుతుంటే దశరథ కొట్టడానికి చేయి ఎత్తబోతాడు కానీ శివన్నారయణ ఆపుతాడు. నా మనవరాలిని బ్రతికించు నాన్న అని కోరితే అది నీ మనవరాలు ఎలా అవుతుంది వినడానికి అసహ్యంగా ఉంది అంటాడు. ఈలోగ కార్తిక్ అక్కడికి వచ్చి అయితే చెవులు మూసుకోండి అంటాడు ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.