కరీనంగర్ మహిళా కలెక్టర్‌ని బహిరంగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivas Reddy) అవమానించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇది కాంగ్రెస్ నాయకుల అహంకారానికి పరాకాష్ఠ అని ఆమె మండిపడ్డారు. ఇలాంటి సిగ్గుమాలిన వైఖరి ఆమోదయోగ్యం కాదన్నారు. ఇది కేవలం కలెక్టర్‌ను అవమానించడమే కాదని.. మొత్తం అధికార యంత్రాంగాన్నే అవమానించడమని పేర్కొన్నారు.
ఇటువంటి చర్యలు పాలన వైఫల్యాన్ని ప్రతిబింబిస్తాయన్నారు. మహిళా కలెక్టర్‌కు తాము అండగా ఉంటామని తెలిపారు. ఈ ఘటనపై మంత్రితో పాటు కాంగ్రెస్ పార్టీ కలెక్టర్‌కు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా శుక్రవారం కరీంనగర్ జిల్లాలో కేంద్రమంత్రుల పర్యటనలో భాగంగా కలెక్టర్ పమేలా సత్పతిపై మంత్రి పొంగులేటి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.