రైల్ నిలయం, జనవరి 24(తెలుగు ప్రభ): రైల్వేటికెట్ బుక్ చేసేందుకు డబ్బులు లేవని దిగులుపడుతున్నారా? ఇక నుంచి చేతిలో డబ్బులు లేకున్నా రైలు టికెట్ను బుక్ చేసుకోవచ్చు.
డబ్బులు లేకపోయినా ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని భారతీయ రైల్వే అందుబాటు లోకి తెచ్చింది. https://www.epaylater.in/ అనే వెబ్ సైట్ ద్వారా ఒక్క రూపాయి చెల్లించక పోయినా ట్రైన్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇందుకు అదనంగా ఎలాంటి చార్జీలు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. డబ్బులు సర్దుబాటు చేసుకుని డబ్బులు చెల్లించేందుకు 14 రోజులు గడువు విధించారు. అయితే, టికెట్ బుక్ చేసుకున్న 14 రోజుల్లోగా డబ్బులు చెల్లించక పోతే మాత్రం 3.5 శాతం సర్వీస్ ఛార్జీ కట్టాల్సి ఉంటుందని అధికారులు వెల్లడించారు.
Train ticket: ఇక నుంచి డబ్బులు లేక పోయినా రైలు టికెట్!
ట్రైన్ టికెట్స్ మేడ్ ఈజీ