తన సోదరి సకలమ్మ పార్థివదేహానికి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR)) శ్రద్ధాంజలి ఘటించారు. మునిరాబాద్లోని ఆమె నివాసానికి చేరుకున్న కేసీఆర్.. సోదరి పార్థివదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులు, బంధువులను ఓదార్చారు. అలాగే ఆమె పార్థివదేహానికి కేటీఆర్(KTR) , హరీష్ రావు(Harish Rao), కవిత (Kavitha) కూడా నివాళులర్పించారు. పూడూరులోని స్మశానవాటికలో సకలమ్మ అంత్యక్రియలు జరగనున్నాయి. అంతిమయాత్రలో బీఆర్ఎస్ నేతలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గాన్నారు.
కాగా మాజీ సీఎం కేసీఆర్కు చీటి సకలమ్మ (82) ఐదో సోదరి. ఆమె స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పెదిర గ్రామం. భర్త హన్మంతరావు కొన్నేళ్ల క్రితమే మృతి చెందారు. సకలమ్మ కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతూ హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో శుక్రవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు.