Thursday, February 6, 2025
Homeఆంధ్రప్రదేశ్Wine Shops: మందుబాబుల‌కు బ్యాడ్‌న్యూస్‌.. వైన్స్‌ బంద్

Wine Shops: మందుబాబుల‌కు బ్యాడ్‌న్యూస్‌.. వైన్స్‌ బంద్

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం(Republic Day) సంద‌ర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపు(ఆదివారం) వైన్స్, మాంసం దుకాణాలు మూత‌ప‌డ‌నున్నాయి. ఈ మేర‌కు ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. ఎవ‌రైనా ఈ ఆదేశాల‌ను ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు ఉంటాయ‌ని హెచ్చ‌రించాయి. అన్ని నగరాలు, ప‌ట్ట‌ణాల్లోనూ ఈ ఆదేశాలు తప్పుకుండా అమలు చేయాలని తెలిపాయి. దీంతో మందుబాబులు వైన్స్ షాపుల ముందు క్యూక‌డుతున్నారు. ముందుగానే త‌మ‌కు కావాల్సిన మ‌ద్యం బాటిళ్ల‌ను ఇంటికి తెచ్చుకుంటున్నారు.

- Advertisement -

కాగా ప్రతి ఏటా రిప‌బ్లిక్ డే, స్వాతంత్ర్య దినోత్స‌వం, గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా మ‌ద్యం, మాంసం విక్ర‌యాల‌ను ప్ర‌భుత్వాలు బంద్ చేస్తుంటాయ‌నే సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రేపు జరిగే 76వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం కార‌ణంగా తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా వైన్స్, మాంసం విక్రయాలపై నిషేధం విధించాయి. అయితే రేపు ఆదివారం కావ‌డంతో ముక్క తినేవారికి మాత్రం ఇది బ్యాడ్‌న్యూస్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News