Thursday, January 30, 2025
HomeNewsDevuni Kadapa: శాస్త్రోక్తంగా దేవుని కడపలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Devuni Kadapa: శాస్త్రోక్తంగా దేవుని కడపలో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమల (Tirumala) తొలి గడప దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి (జనవరి 29) ఫిబ్రవరి 6వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో అంకురార్పణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం 6 గంటలకు శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు. మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణం జరిగిందని ఆలయ అర్చకులు తెలిపారు.

- Advertisement -

ధ్వజారోహణం :
ఈ రోజు ఉదయం 9.30 – 10.30 గం.ల మధ్య మీనల‌గ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలకు ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

చలువ పందిళ్లు,రంగవల్లులు
చలువ పందిళ్లు వేసి అందంగా రంగవల్లులు తీర్చిదిద్దారు. ప్రతిరోజూ వాహన సేవల ముందు కళా బృందాలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వాహన సేవలు ప్రతి రోజూ ఉదయం 9 నుండి 10 గంటల వరకు నిర్వహిస్తారు. తిరిగి రాత్రి 8 నుండి 9 గంటల వరకు జరుగనున్నాయి.

హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు
ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

బ్రహ్మోత్సవాల్లో వాహన సేవల వివరాలు :

29-01-2025 ఉదయం – ధ్వజారోహణం, రాత్రి – చంద్రప్రభ వాహనం.

30-01-2025ఉద‌యం – సూర్యప్రభవాహనం, రాత్రి – పెద్దశేష వాహనం.

31-01-2025 ఉద‌యం – చిన్నశేష వాహనం, రాత్రి – సింహ వాహనం.

01-02-2025 ఉద‌యం – కల్పవృక్ష వాహనం, రాత్రి – హనుమంత వాహనం.

02-02-2025 ఉద‌యం – ముత్యపుపందిరి వాహనం, రాత్రి – గరుడ వాహనం.

03-02-2025 ఉద‌యం – కల్యాణోత్సవం, రాత్రి – గజవాహనం.

ఫిబ్రవరి 3న తెల్లవారుజామున సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి, అర్చన, తోమల నిర్వహిస్తారు. అనంత‌రం శ్రీ‌వారి జ‌న్మ‌న‌క్ష‌త్ర‌మైన శ్ర‌వ‌ణా న‌క్ష‌త్రాన్ని పుర‌స్క‌రించుకుని ఉద‌యం 10 గంటల నుండి స్వామివారి క‌ల్యాణం వైభ‌వంగా నిర్వ‌హిస్తారు.

04-02-2025 ఉద‌యం – రథోత్సవం, రాత్రి ధూళి ఉత్సవం.

05-02-2025 ఉద‌యం – సర్వభూపాల వాహనం, రాత్రి – అశ్వ వాహనం.

06-02-2025 ఉద‌యం – వసంతోత్సవం, చక్రస్నానం, రాత్రి – హంసవాహనం, ధ్వజావరోహణం.

ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News