జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా రవాణా శాఖలో కొత్త లోగోతో సిబ్బంది హాజరయ్యారు. డిసెంబర్ నెలలో రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రవాణాశాఖ నూతన లోగోని ఆవిష్కరించారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు ఈరోజు నూతన లోగోతో రవాణా శాఖ అధికారులు, సిబ్బంది 76 వ గణతంత్రం దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు.
