ఫాంహౌస్‌కే పరిమితమైన కేసీఆర్‌కు ప్రతిపక్ష హోదా ఎందుకని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. తాము ఎన్నికల వరకే రాజకీయాలు చేస్తామని, ఆ తర్వాత అభివృద్ధి, సంక్షేమమే తమ లక్ష్యమన్నారు.
ఆదివారం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం అప్పారెడ్డి గూడలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ల సిద్ధాంతం ఆధారంగా కాంగ్రెస్ ప్రజా పాలన కొనసాగుతోందని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఇళ్లు, రేషన్ కార్డు రాలేదని విమర్శించారు. చౌక బారు విమర్శలు చేయొద్దని ప్రతి పక్షాలను ప్రతిపక్షాలకు హితవుపలిారు.

‘కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మకం.. మాట ఇస్తే నిలుపుకుంటామని తెలిపారు. అన్ని కులాలు, మతాలను అక్కున చేర్చుకునే పార్టీ కాంగ్రెస్’ అని తెలిపారు. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా మాటకు కట్టుబడి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని గుర్తు చేశారు. తెలంగాణను కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు అన్నట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఉక్కు మహిళ ఇందిరమ్మ పేరు పెట్టొద్దని అంటున్నారని ధ్వజమెత్తారు.
