మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) తెలంగాణ హైకోర్టు (Telangana High Court)ను ఆశ్రయించారు. పోచారం పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై కోర్టులో విచారణ జరగనుంది. కాగా ఇటీవల మేడ్చల్ మండలంలోని ఏకశిలానగర్‌లో రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై ఈటల చేయిచేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో వాచ్‌మెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తనపై తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాంటూ ఈటల హైకోర్టులో పిటిషన్ వేశారు.
Eatala Rajender: హైకోర్టును ఆశ్రయించిన ఈటల రాజేందర్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES