ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్. ఈ వ్యాధి పేరు వింటేనే భయం ఆవహిస్తుంది. ఏటా లక్షలాది మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ వ్యాధి కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. సరైన జీవనశైలి లేకపోవటం, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా కూడా క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతున్నట్టు అంచనా వేస్తున్నారు. మరి దీని బారిన పడకుండా తప్పించుకునేందుకు సరైన ఆహర పదార్ధాలు తినాలి. మరి అలాంటి ఆహర పదార్ధాల్లో పుట్టగొడుగులు ఒక్కటి. ఇది మీ పుడ్ మెనులో ఉంటే మీ ఆరోగ్యానికి ఢోకా లేనట్టే.
ప్రతి ఒక్కరు తప్పనిసరిగా పుట్ట గొడుగులు తినాల్సిన అవసరం ఉందని అంటున్నారు నిపుణులు. దీనిని శాఖాహారులు, మాంసాహారులు కూడా బాగా తింటుంటారు. పుట్టగొడుగులను తినడం వల్ల చాలా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పుట్టగొడుగుల్లో ఔషధ గుణాలు కల్గి ఉంటుంది. ఇది తినటం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడటానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు.
‘ధింగ్రీ మష్రూమ్’
ఈ మష్రూమ్‌లో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సి , ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఈ మష్రూమ్ రక్తపోటును అదుపులో ఉంచుతుందని చెబుతున్నారు.
మరి ముఖ్యంగా ఈ శీతాకాలంలో ఈ మష్రూమ్ తినడం వల్ల ఎముకలు , దంతాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. జుట్టు రాలే సమస్య ఉన్నవారు కూడా ఈ మష్రూమ్‌ని తీసుకోవటం వల్ల చాలా ఉపయోగం ఉంటుందంటా. వీటిని అన్ని చోట్ల పెంచలేనప్పటికీ గాజీపూర్ వ్యవసాయ విజ్ఞాన కేంద్రంలో దీని ఉత్పత్తి పెరుగుతోందని సమాచారం. ఫార్మాస్యూటికల్ కంపెనీలలో కూడా ధింగ్రీ మష్రూమ్‌కు ఇప్పుడు డిమాండ్ బాగా ఉంది.
ఈ మష్రూమ్‌ను ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత మందుగా వినియోగిస్తున్నట్లు గాాజీపూర్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఓంకార్ తెలిపారు. దీనిని ప్రోటీన్ సప్లిమెంట్‌గా యూస్ చేయవచ్చన్నారు. ఇలా ఈ మష్రూమ్ తో చాలానే ఉపయోగాలు ఉన్నాయని చెబుతున్నారు.