ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప 2’(Pushpa 2) చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపిన సంగతి తెలిసిందే. విడుదలైన రోజు నుంచి వసూళ్ల సునామీ సృష్టిస్తోన్న ఈ మూవీ ఇప్పటివరకు రూ.1800కోట్లకు పైగా కలెక్షన్స్‌తో అదరగొట్టింది. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు అల్లు అర్జున్ నటన, సుకుమార్ టేకింగ్‌కు ఫిదా అయ్యారు. దీంతో బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా నిలిచింది. అలాగే తెలుగు సినిమాల్లో ప్రథమ స్థానం దక్కించుకుంది.
ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఓటీటీ(Pushpa 2 Ott Release) విడుదలకు సిద్ధమైంది. అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ రీలోడెడ్ వెర్షన్‌ను డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది. జనవరి 30 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు అధికారిక ప్రకటన వచ్చేసింది.