విక్టరీ వెంకటేష్ తన నటనతో మెప్పించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) సినిమా కలెక్షన్ల రికార్డు సృష్టిస్తోంది. సినిమా థియెటర్లలో ప్రేక్షకులను నవ్వులతో మెుచెత్తడంతో పాటుగా బాక్సాఫీసు వద్ద కాసుల జల్లులు కురిపిస్తుంది. ఇప్పటికే సినిమా విడుదలైన 13 వ రోజు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఈ సినిమా రూ.6.77 కోట్లు షేర్ వసూలు చేసింది.
అంతే కాదు హీరో ప్రభాస్- రాజమౌళి కాంబోలో వచ్చిన బాహుబలి-2 కూడా 13 వ రోజు వచ్చిన షేర్ ను విక్టరి వెంకేటశ్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా క్రాస్ చేసినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ.276 కోట్ల వసూళ్లను రాబట్టింది.
విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఇందులో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దీనిని దిల్ రాజు నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు. నరేష్, అవసరాల శ్రీనివాస్ కీలక పాత్రల్లో కనిపించారు. అయితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.