Sunday, April 20, 2025
HomeఆటJasprit Bumrah: టెస్టు క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌గా జస్‌ప్రీత్‌ బుమ్రా

Jasprit Bumrah: టెస్టు క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌గా జస్‌ప్రీత్‌ బుమ్రా

భారత స్టార్ బౌలర్ జస్‌ప్రీత్‌(Jasprit Bumrah)మరో ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డుకు ఎంపికయ్యాడు. 2024 సంవత్సరానికిగాను టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌(Test Cricketer Of The Year) అవార్డుకు బుమ్రాను ఐసీసీ ఎంపిక చేసింది. గతేడాది టెస్టుల్లో 13 మ్యాచ్‌ల్లో 71 వికెట్లు పడగొట్టి అద్భుతమైన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో 2024లో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఇక టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు టీమిండియా బౌలర్ అర్ష్‌దీప్‌ సింగ్ ఎంపికైన సంగతి తెలిసిందే.

- Advertisement -

ఇదిలా ఉంటే భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన(Smriti Mandhana) వన్డే క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు 2024 గెలుచుకుంది. 28 ఏళ్ల స్మృతి ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకోవడం ఇది రెండోసారి. 2018లో మొదటిసారిగా వన్డే క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎంపికైంది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్ తర్వాత రెండోసారి ఈ అవార్డు అందుకున్న రెండో ప్లేయర్‌గా మంధాన నిలిచింది. కాగా గతేడాది వన్డేల్లో 13 మ్యాచ్‌లు ఆడి 747 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసింది. మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో మంధాన తర్వాత లౌరా వోల్వార్డ్(697), టామీ బ్యూమోంట్(554), హీలీ మాథ్యూస్(469) ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News