హన్మకొండ జిల్లా(Hanumakonda)లో రోడ్డు ప్రమాదం(Road accident) జరిగింది. కమలాపురం మండలం గూడురు శివారులో ఆర్టీసీ బస్సు- టాటా ఏస్ వాహనం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 20 మంది కూలీలకు గాయాలయ్యాయి. వీరిలో డ్రైవర్తో సహా మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కమలాపూర్ మండలం వంగపల్లి క్రాస్ దగ్గర మిర్చి తోట ఏరి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలంతా హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండలం మునిపల్లి గ్రామానికి చెందినవారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.
Road acccident: హనుమకొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 20 మంది కూలీలకు గాయాలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES