విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam) బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఈ సినిమా విపరీతంగా నచ్చడంతో మూవీకి వసూళ్ల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో 13 రోజుల్లోనే రూ.276కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డులు సృష్టిస్తోంది. ప్రేక్షకులు ఈ మూవీ చూసేందుకు థియేటర్లకు క్యూకడుతుండగానే ఓ షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది.
ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్కు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ 5 సొంతం చేసుకుంది. అయితే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి ప్రథమార్థంలో స్ట్రీమింగ్ చేయాల్సి ఉంది. అయితే ఇంకా థియేటర్‌కు జనాలు వస్తుండటంతో ఓటీటీ స్ట్రీమింగ్ వాయిదా వేయాలని మేకర్స్ సదరు సంస్థను కోరుతున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. కానీ జీ5 మాత్రరం స్ట్రీమింగ్ చేయడానికే మొగ్గు చూపుతుందట. మరి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్పై రెండు, మూడు రోజుల్లో క్లారటీ రానుంది.