పెదవులు అందంగా, ఆరోగ్యంగా కనిపించడానికి కొన్ని వంటింటి చిట్కాలు…
ఒక టీస్పూను తెనెలో అర టీస్పూను పంచదార కలిపి ఆ మిశ్రమాన్ని పెదవులపై రాస్తే చర్మంపై ఉన్న మ్రుతకణాలు పోయి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
రాత్రి పడుకోబోయే ముందు పెదాలకు ఒక టీస్పూను ఆలివ్ ఆయిల్ రాసుకుని ఉదయం లేచి కడిగేసుకోవాలి. ఇలా చేస్తే పెదవులకు కావలసినంత తేమ అందుతుంది.
నిమ్మరసంలో బ్లీచింగ్ గుణాలు ఉన్నాయి. అందుకే నిమ్మరసంలో కాటన్ బాల్ ముంచి పెదాలపై ఇరవై నిమిషాలు పెట్టుకుని ఆతర్వాత నీటితో కడిగేసుకోవాలి.
పెదాలు తేమగా ఉండడానికి రోజంతా కొద్ది కొద్దిగా నీళ్లు తాగుతుంటే మంచిది.
పొడి చేసిన ఓట్స్, చక్కెర, తేనె, వెజిటబుల్ ఆయిల్ మిశ్రమాన్ని పెదాలపై రాసుకుంటే చర్మంపై మ్రుతకణాలను పోగొడుతుంది. దీన్ని పెదాలపై రాసుకునే ముందు పెదాలను శుభ్రంగా కడుక్కోవడం మరవొద్దు.
చక్కెర, కొబ్బరినూనె, దాల్చినచెక్క, తేనెల మిశ్రమంతో కూడా పెదాలపై చర్మాన్ని మెరిసేట్టు, మ్రుదువుగా ఉండేలా చేసుకోవచ్చు.
ఆరు గులాబీ రెక్కలు, పాలు కలిపిన మిశ్రమాన్ని పెదాలకు రాసుకుంటే మెరుస్తాయి. అలాగే బీట్ రూట్ జ్యూసు, తేనె మిశ్రమం కూడా పెదాలను గులాబీరంగులో ఎంతో అందంగా, ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి. స్ట్రాబెర్రీలను మెత్తగా చేసి అందులో తేనె, బాదం నూనె వేసి ఆ మిశ్రమాన్ని పెదాలకు రాసుకుంటే మెరుస్తూ ఉంటాయి.