ఈరోజు ఎపిసోడ్‌లో రుద్రాణిని కరెంట్ షాక్‌తో బలి చేసిన రాహుల్‌ని కర్ర తీసుకుని శుభ్రంగా కొడుతుంది. మరోవైపు అప్పు మళ్లీ ట్రైనింగ్‌కి వెళ్తుందని కళ్యాణ్ లగేజ సర్దుతాడు. అప్పు ఏమో అది వద్దు ఇది వద్దు అని ఇ్బంది పెడుతుంది. ఈలోపు అపర్ కళ్యాణ్‌కి ఫోన్ చేస్తుంది. నా మాట అంటే నకు గౌరవం ఉంటే నేను అడిగిన దానికి నిజం చెప్పు అంటుంది. కావ్య, రాజ్ అవుట్ హౌస్ తాకట్టు పెట్టిన విషయం తెలుసా ఎందుకు చేసారు అంటే నాకు తెలియదు అంటాడు సరే తర్వాత చేస్తాను అని పెట్టేస్తుంది.
అక్కడ ఇంటి దగ్గర దాన్యలక్షి కోర్టు నోటీస్ పంపిస్తుంది, అది కొరియర్ వచ్చిన తర్వాత ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ఇందిరా దేవి, అపర్ణ గడ్డి పెడతారు. నీ కొడుకే నువ్వు వద్దు నీ ఆస్తి వద్దు అని బయటికి వెళ్లిపోయాడు ఇంకెందుకు ఆస్తి నీకు అని అడుగుతాడు. నీ కోడలు మావగారిని నోరు మూసుకోమని అంది, ఇంక చిన్న మావగారిని ఏం లెక్కేస్తుంది అని అంటుంది దాన్యలక్ష్మి. రుద్రాణి రెచ్చిపోతుంటే కావ్య నోరు మూసుకోని, ధాన్యలక్ష్మితో ఈ ఆస్తి అంతా నా పేరు మీద ఉన్నా నాది కాదు మా పుట్టింటికి దారబోయను, దుగ్గిరాల వారసులకు అందరికీ సమానంగా వస్తుంది అన్నా కుడా ప్రకాశం,దాన్యలక్ష్మిలు మాత్రం మేము వినేది లేదు. ఇన్నాళ్లు నువ్వు చేసింది చాలు మేము కోర్టుకి వెళ్లి తీరతాం అంటారు.
మరోవైపు చేసేదమి లేక అపర్ణ,సుభాష్ కూర్చుని మాట్లాడుకుంటుంటే కావ్య వచ్చి సుభాష్‌ని ఏదొకటి చేసి వాళ్లన ఆపమని మీరు చెప్తే చిన్న మావయ్య వింటారని అంటుంది. దానికి అపర్ణ చేసేది నువ్వు దానిని సరిచేయాల్సింది నా భర్త నా, దీని అంతటికీ కారణం నువ్వు కాబట్టి నువ్వే చేయాలి అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.