ఈరోజు ఎపిసోడ్‌లో సుమిత్ర ఆడపడుచు ఇంటికి వస్తే అవమానించి పంపిచారు సాయం కోసం ఇంటికి వస్తే కన్నీళ్లతో పంపించారు అని దశరథ దగ్గర బాధపడుతుంది. మీ చెల్లిని ఎందుకు పట్టించుకోలేదు మీ నాన్నని ఎందుకు ఎదిరించలేకపోయారు, రాఖీ కట్టించుకుంటే సరిపోదు అండగా నిలబడాలి అంటుంది మరోవైపు కార్తీక్, అనసూయ, కాంచనలను దీపతో ఏమి చెప్పొద్దు అంటాడు. దీప అక్కడ అలా కూర్చుని ఉంటే ఏమైంది అని అడుగుతాడు. దీప మీరు ఎక్కడికి వెళ్లారు అని అడుగుతుంది. ఇప్పుడే మీ ఫ్రెండ్ వాళ్లు ఊరు నుంచి వచ్చేసారు, వెళ్లి మనం శౌర్యని తీసుకుని వచ్చేదాం అంటుంది.
కార్తిక్ షాక్ అవుతూ తర్వాత వెళ్లి తీసుకువద్దాం అంటాడు. కార్తిక్ నేను తర్వాత తీసుకువస్తాను అంటే దీప మాట వినదు. దీప ఎంతకూ మాట వినకుండా ప్రశ్నలు వేస్తుంటే కార్తిక్ సీరియస్ అయ్యి, శౌర్య హాస్పిటల్‌లో ఉంది అని నిజం చెప్తాడు. ప్రాణాలు కోసం పోరాడుతుంది అని చెప్తాడు. అప్పుడు దీప షాక్ అయ్యి కార్తిక్ కాలర్ పట్టుకుని మీ మాటలతో నన్ను ఎందుకు మోసం చేశావ్? నా కూతురు ఎక్కడ, నా కూతురుకు ఏదైనా జరిగిన నువ్వు ఇలాగే చేస్తావా అని నిలదీస్తుంది. అప్పుడు అనసూయ దీప చెంప పగలగొడుతుంది. నీకు ఎందుకు చెప్పాలి? ఇప్పటి వరకూ అన్నీ నీకు చెప్పే చేశాడా అని ప్రశ్నిస్తుంది.
నిన్ను నీ కూతురుని చూసుకోవాల్సిన అవసరం ఆ దేవుడికి ఏంటి, కానీ నీకోసం, నీ కూతురు కోసం అంత చేస్తుంటే తననే కాలర్ పట్టుకుని నిలదీస్తున్నావు అని కడిగేస్తుంది. ఆ మాటలకూ దీప బాధపడుతూ ఏడుస్తుంది. నా కూతురుకు ఏమైనా అయితే నేను ఎలా బతకగలను అని అంటుంది. దానిని ఎలా బ్రతికించుకోవాలి, అసలు నా కూతురికు ఏం జరిగిందంటూ కన్నీళ్లు పెట్టుకుంటే.. శౌర్య ప్రాణాలు ఎలా అయినా కాపాడుతాను అని మాట ఇస్తాడు. దీప తన దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి కాపాడండి అంటే దాని ఆపరేషన్‌కు రూ.50 లక్షలు కావాలి ఎంత ట్రై చేసినా దొరకలేదు రేపే ఆపరేషన్ చేయాలి అంటాడు కార్తిక్. దీప శౌర్యను చూడటానికి హాస్పిటల్‌కు వెళ్తే అనసూయ ఊర్లో ఉన్న ఇళ్లు అమ్మి లేదా తాకట్టు పెట్టి అయినా డబ్బు సంపాదించాలి నేను వెంటనే ఊరు వెళ్లాలి, రేపటి లోగా డబ్బు ఏదోలా చూడాలని వెళ్తుంది.ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.