యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడం ఎంతో ముఖ్యం. ఇది శరీరంలో ఎక్కువగా ఉంటే ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్ అనే రసాయనాన్ని శరీరం రిలీజ్ చేసినప్పుడు ఏర్పడే వ్యర్థ పదార్థం. సాధారణంగా మూత్రపిండాలు ఈ యాసిడ్‌ను ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. కానీ మూత్రపిండాలు సరిగా పనిచేయకపోతే, ఈ యాసిడ్ కీళ్ల చుట్టూ స్పటికాలుగా పేరుకుపోతుంది. దీని వల్ల కీళ్ల నొప్పులు, వాపులు, నడవడం కష్టమవటం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే యూరిక్ యాసిడ్ తగ్గించేందుకు సరైన ఆహారపు మార్పులు అవసరం.
మిల్లెట్స్‌తో యూరిక్ యాసిడ్ నియంత్రణ: అధిక యూరిక్ యాసిడ్ సమస్యను ఎదుర్కొంటున్నవారు గోధుమ పిండి రొట్టెలకు బదులుగా మిల్లెట్స్‌తో చేసిన రొట్టెలను తీసుకోవడం మంచిది. మిల్లెట్స్ పిండిలో డైటరీ ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలు అందించడమే కాకుండా యూరిక్ యాసిడ్ స్థాయిలను సహజంగా తగ్గిస్తాయి. ముఖ్యంగా సజ్జ రొట్టెలు మంచి ఎంపికగా సూచిస్తున్నారు నిపుణులు.
సజ్జ రొట్టెల వలన ప్రయోజనాలు:
జీర్ణశక్తి పెరుగుతుంది: సజ్జ రొట్టెలు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తాయి. అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తాయి.
బాడీ డిటాక్స్ అవుతుంది: మిల్లెట్స్‌లో ప్యూరిన్ స్థాయిలు తక్కువగా ఉండటం వల్ల శరీరం నుంచి టాక్సిన్స్ తొలగించడంలో సహాయపడతాయి.
బరువు తగ్గవచ్చు: అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారు మిల్లెట్స్ రొట్టెలు తీసుకోవడం వల్ల మెటబాలిజం మెరుగుపడుతుంది.
పోషక విలువలు ఎక్కువ: మిల్లెట్స్ పిండిలో పిండి పదార్థాలు, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తహీనత సమస్యను తగ్గించడంలో సహాయపడతాయి.
అధిక యూరిక్ యాసిడ్‌తో ముప్పులు: యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు కీళ్లలో స్ఫటికాలు పేరుకుపోతాయి. ఇది కీళ్ల నొప్పులు, వాపులు, మరియు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. కాబట్టి, యూరిక్ యాసిడ్ స్థాయిలు నియంత్రణలో ఉంచేందుకు పౌష్టిక ఆహారం, సరైన జీవన శైలిని అనుసరించాల్సి ఉంటుంది.
ఈ సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇచ్చాము. మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి, నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం.