Thursday, January 30, 2025
Homeహెల్త్Rice: మూడు పూటలా అన్నం తింటే ఈ అనారోగ్య సమస్యలు తప్పవు..

Rice: మూడు పూటలా అన్నం తింటే ఈ అనారోగ్య సమస్యలు తప్పవు..


ఈ రోజుల్లో కూడా చాలా మంది 3 పూటలా అన్నమే (Rice) తింటున్నారు. ఇలా తినటం వల్ల మన బాడీలో చాలా అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు నిపుణులు. మరి ఆ సమస్యలు ఏంటో తెలుసుకుందాం పదండి. రోజు అన్నం తినటం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. రైస్ లో అధిక కార్బోహైడ్రేట్‌ ఉండటం వల్ల ఈ సమస్య వస్తుందని చెబుతున్నారు. కొవ్వు శరీరంలో పేరుకుపోవటం ఫలితంగా అధిక బరువుకు దారీ తీస్తుంది. ఇందుకు కారణం సరైన ఆహర నియమాలు పాటించకపోవటమే. బాడీకి కావాల్సినంత కంటే అధిక కార్బోహైడ్రేట్ తీసుకోవటం వల్ల బరువు అదుపులో ఉండదని చెబుతున్నారు.

భవిష్యత్తులో ఊబకాయం తప్పదు.
రోజు అన్నం ఎక్కువగా తినటం వల్ల బ్లడ్ లో చక్కెర స్థాయిలు అధికమౌతాయని చెబుతున్నారు నిపుణులు. ఫలితంగా ఇన్సులిన్‌ వ్యవస్థ క్షీణించే అవకాశం ఉంటుందన్నారు. దీర్ఘకాలంలో ఇది మధుమేహానికి దారితీస్తుందని చెబుతున్నారు. సాధారణ డైట్‌లో రైస్ పరిమితిగా ఉండటం చాలా మంచిదని చెబుతున్నారు.


విటమిన్లు, ఖనిజాలు అందవు
క్రమంగా రోజు అన్నం మాత్రమే అధికంగా తింటే శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందవని అంటున్నారు న్యూట్రిషియన్స్. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. మన బాడీకి ప్రోటీన్‌ తో కూడిన ఆరోగ్యకరమైన కొవ్వు కూడా చాలా అవసరమని చెబుతున్నారు. ఇవి సరైన సమతుల్యమైనా ఆహారంలోనే లభిస్తాయని చెబుతున్నారు.

మలబద్దకం, జీర్ణక్రియపై ఎఫెక్ట్
రైస్ ఎక్కువగా మూడు పూటల తినటం వల్ల ఫైబర్‌ శరీరానికి స్వల్పంగా అందుతుంది. ఈ కారణంగా మలబద్ధకం, జీర్ణక్రియపై ఎఫెక్ట్ పడచ్చు అంటున్నారు. తినే ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు, పండ్లు ఉండాలే చూసుకోవాలంటున్నారు. ఈ ఆకుకూరలు జీర్ణక్రియకు మంచిగా సహకరిస్తాయని న్యూట్రిషన్స్ పలు అధ్యయనాలు ద్వారా తెలుపుతున్నారు.

గుండె సమస్యలు
మూడు పూటల అన్నం తినటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. అధిక కార్బ్స్‌తో గుండెకు కొవ్వు పేరుకుపోవడంతో అలసట ఎక్కవగా ఉంటుందని చెబుతున్నార. గ్లైసెమిక్‌ ఇండెక్స్‌ పెరిగి శక్తి తగ్గిపోతుందన్నారు.

లివర్‌ సమస్యలు
సరైన డైట్ పాటించక అధికంగా ఆహరం తినటం వల్ల ఫ్యాటీ లివర్‌కు కారణం కావచ్చుని చెబుతున్నారు. రక్తపోటు సమస్యలు వస్తాయన్నారు. ఫలితంగా బీపీ పెరిగి కండరాలు క్షీణించిపోయే అవకాశం ఉంటుందన్నారు. లివర్‌ ఆరోగ్యం కోసం సమతుల్య ఆహారానికి ప్రాముఖ్యత ఇవ్వాలని చెబుతున్నారు. శరీరానికి సరైన న్యూట్రిషన్‌ అందినప్పుడు మనిషి ఆరోగ్యకరంగా ఉంటారన్నారు నిపుణులు.

చూశారుగా రోజు మూడు పూటల అన్నం తింటే ఎన్ని అనారోగ్య సమస్యలు వస్తాయో… మరి మీరు కూడా రోజు మూడు పూటల అన్నం తింటే వెంటేనే మానుకోని సమతుల్యమైనా ఆహర నియమాలు పాటించండి. అవసరమైతే న్యూట్రిషన్స్ సలహ తీసుకోండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News