మహా కుంభమేళా జరుగుతున్న ఉత్తర్ప్రదేశ్(Uttar Pradesh)లో ఘోరం చోటుచేసుకుంది. బాగ్పత్లో నిర్వహిస్తున్న లడ్డూ మహోత్సవం(Laddu Mahotsavam)లో అపశృతి జరిగింది. లడ్డూ కోసం జనాలు ఎగబడటంతో అక్కడ ఏర్పాటుచేసిన ప్రధాన వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు అక్కడికికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 60 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ప్రమాదంపై ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
Laddu Mahotsavam: లడ్డూ మహోత్సవంలో అపశృతి.. ఏడుగురు దుర్మరణం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES