Thursday, January 30, 2025
Homeఆంధ్రప్రదేశ్YS Sharmila: "సూపర్ సిక్స్ - సూపర్ ఫ్లాప్".. షర్మిల విమర్శలు

YS Sharmila: “సూపర్ సిక్స్ – సూపర్ ఫ్లాప్”.. షర్మిల విమర్శలు

“సూపర్ సిక్స్ – సూపర్ ఫ్లాప్” అయిందని.. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్లేనని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) విమర్శించారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

- Advertisement -

“కూటమి ప్రభుత్వం ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ హామీలకు ఇక శుభం కార్డు పడ్డట్లే. చంద్రబాబు గారి నిన్నటి ప్రజెంటేషన్ ఇందుకు నిదర్శనం. నీతి ఆయోగ్ రిపోర్ట్ ముందుపెట్టి, డబ్బులుంటేనే పథకాలని నీతి సూక్తులు చెప్పారు. పథకాలు కావాలంటే ఆదాయం పెంచాలట. మోకాలికి బోడి గుండుకు ముడిపెట్టినట్లుంది చంద్రబాబు గారి తీరు. నమ్మి అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసం చేశారు. 50 లక్షల మంది అన్నదాతలను వంచించారు. 80 లక్షల మంది విద్యార్థులకు ద్రోహం చేశారు. కోటిన్నర మంది మహిళలను మోసం చేశారు. 50 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకున్నారు.

పథకాలకు ఆర్థిక వెసులుబాటు లేదని, YCP ప్రభుత్వ ఆర్థిక విధ్వంసమే కారణమని, జగన్ గారి ఆర్థిక ఘోరమే నిదర్శనమని చెప్పే బాబు గారు.. ఎన్నికల్లో హామీలు ఇచ్చే ముందు తెలియదా ఈ ఆర్థిక విధ్వంసం, ఘోరం. ‘సూపర్ సిక్స్’ పథకాల రూపకల్పనలో కనపడలేదా రాష్ట్ర ఆర్థిక భారం. రాష్ట్రం రూ.14 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని చెప్పింది మీరే. కూటమిని గెలిపిస్తే 100 రోజుల్లో గాడిన పెడతామన్నది మీరే. తీరా ఓట్లు పడ్డాక ఇచ్చిన హామీలపై మడతపేచీ పెట్టడం ఎంతవరకు సమంజసం ?

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రం అప్పుల్లో ఉందని, అప్పులు పుట్టడం లేదని సాకులు వెతకడం మాని.. పథకాల అమలుపై దృష్టి పెట్టండి. కేంద్రంలో పెద్దన్న పాత్ర పోషించే మీరు.. రాష్ట్ర దీనస్థితిపై ప్రధాని మోడీని పట్టుబట్టండి. పథకాలకు కావాల్సిన నిధులు ఇవ్వాలని అడగండి. నీతి ఆయోగ్ చెప్పినట్లుగా గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగిన ఆర్థిక అరాచకంపై వెంటనే ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపించండి. రాష్ట్ర ఆదాయం ఏ కోటకు మళ్ళిందో తేల్చండి. పథకాలకు కేంద్రం డబ్బులివ్వకపోతే వెంటనే బీజేపీకి ఇచ్చిన మద్దతు ఉపసంహరించుకోండి.” అని షర్మిల వెల్లడించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News