లూసిఫర్ సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. తెలుగులో కూాడా ఇది రీమేక్ అయింది. లూసిఫర్ హిట్ తో లూసిఫర్ 2 కూడా రెడీ అయింది.. మోస్ట్ అవైటెడ్ సినిమాగా మారిని లూసిఫర్ 2 అంటే L2ఇ ఎంపురాన్ రిలీజ్ కోసం సౌత్ మొత్తం వెయిట్ చేస్తోంది.
పృథ్వీ డైరక్షన్ లో
ది కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ టైటిల్ పాత్రలో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో నిర్మిస్తోన్న భారీ చిత్రం L2ఇ ఎంపురాన్ మార్చి 27న థియేటర్లోకి రానుంది. మార్చి 27న తెలుగు, మలయాళ, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌కానుంది. 2019లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన చిత్రం ‘లూసిఫర్’.
బ్రో డాడీ చూశారా?
లూసిఫర్, బ్రో డాడీ చిత్రాల తర్వాత మోహన్ లాల్, పృథ్వీరాజ్ కాంబినేషన్లో వస్తోన్న మూడో సినిమా ఇది. ఈ క్రేజీ మూవీతో జి.కె.ఎం.తమిళ్ కుమరన్ నేతృత్వంలో లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్ మలయాళ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తొలి భాగం లూసిఫర్ హిట్ కావటంతో సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయో ముందుగానే అంచనా వేసిన మేకర్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను మించేలా సినిమాను నిర్మిస్తున్నారు. అనౌన్స్మెంట్ రోజు నుంచే సినిమా ఎలా ఉంటుందోనని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘L2ఇ ఎంపురాన్’ సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌ను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లేలా మేకర్స్ టీజర్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు.
యాక్సిడెంటల్ డైరెక్టర్ పృథ్వీ
హీరో మోహన్ లాల్ పృథ్వీ డైరెక్షన్ టాలెంట్ గురించి వెరైటీగా వర్ణించారు. పృథ్వీరాజ్ యాక్సిడెంటల్ డైరెక్టర్ అని, భారతదేశపు ఉత్తమ దర్శకుల్లో ఒకరు అవుతారని అన్నారు. ఎంపురాన్ షూటింగ్ టైంలో మేము చాలా సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. దర్శకుడిగా పృథ్వీరాజ్ తన 100 పర్సెంట్ ఇచ్చారని, ఎంపురాన్ మార్చి 27న థియేటర్లలోకి వచ్చాక మలయాళ సినిమాకు ల్యాండ్‌మార్క్‌గా నిలుస్తుందని మోహన్ లాల్ అన్నారు.