టీడీపీ యువనేత, మంత్రి నారా లోకేశ్(Nara Lokesh)కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కొంతకాలంగా టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై పార్టీ అధిష్టానం సీరియస్ కావడంతో అందరూ సైలెంట్ అయిపోయారు. తాజాగా ఈ అంశంపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(Butchaiah Chowdary) స్పందించారు. లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వమనడం సమంజసం కాదని స్పష్టం చేశారు. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఉన్నారని గుర్తుచేశారు. అయితే పార్టీ కోసం లోకేష్ ఎంతో కష్టపడి పనిచేశారని.. అందులో ఎటువంటి అనుమానం లేదన్నారు. పార్టీ కూడా ఆయనకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించిందని గుర్తు చేశారు.
ఇక విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) రాజీనమాపై స్పందిస్తూ.. ఉత్తరాంధ్రలో విపరీతమైన దోపిడీ చేశారని, కాకినాడ పోర్టును అల్లుడుకు దోచిపెట్టారని విమర్శించారు. ఆయన దోచిన ఆస్తులన్నీ తిరిగి బాధితులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో వైసీపీ కనుమరుగవుతుందని ఆ పార్టీలో ఎవరు ఉండరని జోస్యం చెప్పారు.