మహిళా రిజర్వేషన్స్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటూ ఢిల్లీలో నిరాహారదీక్ష చేపట్టారు కేసీఆర్ కుమార్తె కవిత. చాలా కాలం నుంచి పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్స్ బిల్లును పార్లమెంటులో వెంటనే ప్రవేశపెట్టాలంటూ భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలో నిరాహారదీక్ష చేపట్టారు. చారిత్రాత్మక జంతర్ మంతర్ వద్ద ఈ ఉదయం ప్రారంభమైన సాంయంత్రానికి దీక్ష ముగుస్తుంది. న్యాయమైన, ధర్మమైన ఆమె డిమాండ్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, మంత్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, లోకసభ సభ్యురాలు మాలోతు కవిత, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, రేఖా నాయక్, మహిళా ఆర్థిక సహకార సంస్థ ఛైర్ పర్సన్ ఆకుల లలిత తదితరులు ప్రముఖులు దీక్షలో కూర్చున్నారు.
Delhi: మహిళా రిజర్వేషన్స్ కోసం కవిత దీక్ష
సంబంధిత వార్తలు | RELATED ARTICLES