Thursday, January 30, 2025
HomeTS జిల్లా వార్తలుఆదిలాబాద్Adilabad: ప్రారంభమైన ఆదివాసీ మహాజాతర 'నాగోబా'

Adilabad: ప్రారంభమైన ఆదివాసీ మహాజాతర ‘నాగోబా’

నో ప్లాస్టిక్

ఆదివాసి గిరిజనులు జరుపుకునే జాతరలలో నాగోబా జాతరకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచంలోనే పేరుగాంచిన నాగోబా జాతర మంగళవారం ఘనంగా ప్రారంభమైంది. ఈనెల 31 వరకు నాగోబా జాతర సందడి నెలకొననుంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లోని నాగోబా ఆలయం వద్ద ఈ జాతర కొనసాగుతుంది. సర్ప జాతిని పూజించడమే ఈ పండగ ప్రత్యేకత. చెట్టుకు పుట్టకు ఒకరు ఉండే ఆదివాసీలు అందరూ కలిసిమెలిసి ఐక్యమత్యంగా చేసుకుని జాతర నాగోబా జాతర.

- Advertisement -

మేస్రం వంశీయుల పాదయాత్ర :

అనాదిగా వస్తున్న ఆదివాసుల ఆచారానికి అనుగుణంగా మేస్త్రం వంశీయులు తెల్లని వస్త్రాలను ధరించి కాలినడకన జన్నారం మండలం కలమడుగు గ్రామ సమీపాన పారే గోదావరి నదిలోని పవిత్రమైన జలాన్ని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మట్టి కుండలో తీసుకుని మేస్రం వంశీయులు కాలినడకన 5 మండలాలు 18 గ్రామాల గుండా నడక సాగించి కేస్లాపూర్ నాగోబా ఆలయానికి అమావాస్య రోజున 28 రాత్రి చేరుకుని గంగాజలం నాగదేవతకు అభిషేకం చేస్తారు.

పూజా విధానం :

మేస్రం వంశీయులు తీసుకొచ్చిన గంగాజలంతో అమావాస్య అర్థరాత్రి రోజున తమ ఆరాధ్య దైవమైన ఆదిశేషునికి క్షీరాభిషేకం చేస్తారు. గోదావరి జలంతో ఆలయ ప్రాంగణమంతా శుద్ధి చేస్తారు. భాజా భజంత్రీలతో ప్రత్యేక పూజలకు శ్రీకారం చుడతారు. కొత్త బట్టలో నవధాన్యాలు, రాగి చెంబులో పాలు కలిపి పుట్టపై ఉంచి పూజలు చేస్తారు. రాగి చెంబులో ఉంచిన పాలను నాగదేవత తాగుతుందని విశ్వసిస్తారు. ఆలయం ఆవరణలో ఉన్న పుట్టను మెస్రం వంశీయుల అల్లుళ్ళు, కూతుర్లతో కలిసి మట్టితో మెత్తిస్తారు. ఈ సందర్భంగా అల్లుళ్లకు ప్రత్యేక నజరానా ను అందిచటం ఇక్కడి ఆనవాయితి.

వివిధ రాష్ట్రాల నుండి జన సందోహం :

ఈ గిరిజన మహా జాతరకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి కాకుండా మహారాష్ట్ర, చత్తీస్గడ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుండి భక్తులు హాజరై తమ మొక్కలను తీర్చుకుంటారు. కేవలం గిరిజనులు మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఈ ఆలయాన్ని వేల సంఖ్యలో సందర్శిస్తారు.

జాతర ప్రత్యేకత ప్రజాదర్బార్ :

ఆదివాసి హక్కుల కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన కొమరం భీమ్ తదనంతరం గిరిజనుల స్థితిగతులను అధ్యయనం చేయడానికి నిజాం ప్రభువులు జీవపరిణామ సిద్ధాంత కర్త ప్రొఫెసర్ హైమన్ డార్ఫ్ ను ఆదిలాబాద్ కు పంపించారు. కొండలు గుట్టలు వాగులు దాటుకుంటూ వచ్చే గిజనుల సమస్యలను తెలుసుకోవడానికి ఈ జాతరలో తొలిసారిగా హైమన్ డార్ఫ్ 1942లో దర్బార్ ఏర్పాటు చేశారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం దర్బార్ కొనసాగుతుంది. స్వాతంత్రానంతరం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ దర్బార్ కొనసాగుతుంది. ఈ దర్బార్ కు గిరిజన నాయకులు, తెగల పెద్దలు, ప్రజా ప్రతినిధులు హాజరవుతారు. ఈ సంవత్సరం జనవరి 31న ఈ ప్రజా దర్బార్ జరగనుంది.

జాతరకు ప్రభుత్వ ఏర్పాట్లు :

ఈ సంవత్సరం నాగోబా జాతర నిర్వహణకు గాను ప్రభుత్వం ఐటిడిఏ ఆధ్వర్యంలో కోటి రూపాయలు విడుదల చేసింది. ఈ నిధులతో 100 సీసీ కెమెరాలు, తత్కాలికంగా 50 టాయిలెట్లు, 40 వాటర్ ట్యాంకులు వేదికలు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించారు. జాతరలో ప్లాస్టిక్ ను నిషేధించారు. క్లాత్ బ్యాగులను అందుబాటులో. రూట్ మ్యాప్ లను, హెల్పింగ్ డెస్క్లను ఏర్పాటు చేశారు. ఎస్పీ గౌస్ ఆలం 500 పైచిలుకు పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితులను తెలుసుకుంటున్నారు. జిల్లా కేంద్రం నుండి నాగోబా జాతరకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News