Thursday, January 30, 2025
HomeదైవంBlack Color: నలుపు రంగు అశుభమని ఎందుకు అంటారో తెలుసా.. కారణం ఇదే..!

Black Color: నలుపు రంగు అశుభమని ఎందుకు అంటారో తెలుసా.. కారణం ఇదే..!

నలుపు రంగుని అశుభంగా మన దేశంలో భావిస్తారు. ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉన్నా, పండగ, మంచి రోజు ఇలా ఏదైనా నలుపు రంగు దుస్తులు వేసుకోవద్దని పెద్దలు చెబుతారు. మరే ఇతర రంగులకు ఎలాంటి అభ్యంతరం చెప్పరు కానీ నలుపు మాత్రం వద్దు అంటారు. అయితే ఇలా ఎందుకు అంటారో తెలుసా.. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా శుభకార్యాల సమయంలో నలుపు దుస్తులను నిషేధిస్తారు. అంతేకాదు చెడు దృష్టి పడకుండా ఉండాలంటే కాళ్లకు, చేతులకు నల్ల దారం కడుతూ ఉంటారు. నిజానికి నలుపు రంగును నెగిటివ్ ఎనర్జీగా పరిగణిస్తారు. మరి నలుపు దారం మాత్రం ఎందుకు కడతారు. ఈ సందేహం అందరికీ వచ్చే ఉంటుంది.

- Advertisement -

శని దేవునికి ఇష్టమైన రంగు నలుపు. ఈ రంగు అతను ఎవరికీ పక్షపాతం కాదని సూచిస్తుంది. అందరినీ ఒకేలా చూస్తుంది. అందుకే నలుపు రంగు దుస్తులు ధరించకూడదని అంటారు. ఇది ప్రతికూల శక్తి ప్రవాహాన్ని పెంచుతుందని చెబుతుంటారు. నలుపు రంగు కూడా కాళి తల్లిని సూచిస్తుంది. నవ దుర్గా 7వ రూపం కాళి మాత. ఆమె తన కోపంతో అందరినీ బూడిద చేసేంత శక్తివంతమైనదిగా పరిగణిస్తారు. అందువల్ల ఆమె కోపాన్ని చల్లార్చడానికి, శివుడు ఆమె పాదాల వద్ద ఉంటాడు. కాళీమాత ప్రభావం వల్ల అమావాస్య రాత్రి చీకట్లు అలుముకుంటాయని నమ్ముతారు. ఆమె జీవితంలో అన్ని రంగులూ తొలగిస్తుందంట.

నలుపు రంగు అశుభానికి చిహ్నంగా పరిగణిస్తారు. నలుపు రంగు ప్రతికూల శక్తిని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. వ్యక్తిపై దాని ప్రభావం త్వరగా ఉంటుంది. దీని వల్ల మనిషి జీవితంలో అనేక రకాల సమస్యలు మొదలవుతాయం. కాబట్టి శుభ కార్యాలలో నలుపు రంగు ధరించడం నిషేధించమని చెబుతుంటారు. శుభకార్యాల సమయంలో నలుపు ధరిస్తే.. వచ్చే పాజిటివ్ ఎనర్జీ కంటే.. నెగిటివిటీ పెరగుతుందంట. అందుకే ఆ సమయంలో దీనిని ఉపయోగించ నివ్వరు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News