Friday, January 31, 2025
Homeచిత్ర ప్రభKarthika Deepam January 29th Episode: డబ్బులు ఇవ్వకుండా చేసిన జ్యోత్స్న.. శౌర్యని చూసి ఏడుస్తున్న...

Karthika Deepam January 29th Episode: డబ్బులు ఇవ్వకుండా చేసిన జ్యోత్స్న.. శౌర్యని చూసి ఏడుస్తున్న దీప..

ఈరోజు ఎపిసోడ్‌లో దీప శౌర్యను చూడాలని అలా వెళ్లిపోతుంటే కార్తిక్ వచ్చి శౌర్యకి నిజం తెలియదు నువ్వు ఇలా ఏడిస్తే శౌర్య భయపడుతుంది అంటాడు. శౌర్య దగ్గర నువ్వు ఏడను అని మాట ఇస్తేనే తీసుకెళ్తాను లేదా నా మీద ఒట్టే అంటాడు. కన్నీళ్లు అయితే ఆపలేను కానీ వాటిని కనపకుండా ఆపగలను అంటుంది దీప . అప్పుడు కార్తిక్ దీపను హాస్పిటల్‌కు తీసుకెళ్తాడు. మరోవైపు పారిజాతం, శివన్నారయణ కూర్చుని కాంచన అన్న మాటలు గుర్తుచేసుకుంటారు. ఈలోగా అక్కడికి దశరథ వచ్చి చెల్లి వచ్చి సాయం అడిగితే పంపించేసాము, శౌర్య, దీప కార్తిక్ వీళ్లందరిని వదిలేసేయి, చెల్లి అడిగినప్పుడు ఇవ్వాలి అంటాడు.

- Advertisement -

దానికి నువ్వు అడుగుతున్నావా వెనక ఉన్న వాళ్లు అడిగిస్తున్నారా అంటే దానికి సుమిత్ర నేను బయటదానిని కాంచన ఈ ఇంటి ఆడపడుచు తనని బాధపెట్టడం మంచిది కాదు అంటుంది. అప్పుడు శివన్నారయణ దీప పేరు ఎత్తగానే వెళ్లిపోయారు అప్పుడే అర్థమైంది వాళ్ల నాటకం ఆడుతున్నారని అంటుంది. దశరథ గట్టిగా అరిచి ఇంకెన్ని సార్లు ఇదే చెప్తారు అంటాడు. చెల్లి చెప్పిన మాట మీద నమ్మకం లేదా అంటాడు. ఈలోగా జోత్స్న వచ్చి అవసరం లేదు దీప నాటకం ఆడిస్తుంది, శౌర్య హాస్పిటల్‌లో లేదు బావ ఫ్రెండ్ ఇంట్లో ఉందని దీపే చెప్పింది అని చెప్తుంది. ఈ మాటలు విని శివన్నారయణ నాకు అంతా అర్థమైంది అని వెళ్లిపోతాడు. పారిజాతం ఇంకా రచ్చ చేస్తుంటే సుమిత్ర, దశరథ అక్కడి నుంచి వెళ్లిపోతారు.

ఆ తర్వాత జోత్స్న పారిజాతం దీపని ఇంకా నాశనం చేయాలి అని మాట్లాడుకుంటారు. అప్పుడు కార్తిక్ నాన్న శ్రీధర్, రెండో భార్య శౌర్య ఆపరేషన్ కోసం నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చే విషయం మాట్లాడుకుంటారు. కార్తిక్ వాళ్ల నాన్న ఆ దీప వళ్లే అందరి జీవితాలు నాశనం అయ్యాయి అంటాడు. దీప కానీ కార్తిక్ కాని ఆ ఇంటి నుంచి వచ్చి సాయం అడిగితే చేయాలి కానీ ఊరికే చేయకూడదు అంటాడు. వాళ్లు అడిగితే సాయం చేద్దాం అంటాడు. అక్కడ హాస్పిటల్‌లో శౌర్య అమ్మానాన్నల ఫొటో పట్టుకుని ఏడుస్తుంది. ఈలోగా అక్కడికి దీప కార్తిక్ వస్తారు.

శౌర్యని చూసి దీప వెంటనే వెళ్లి హత్తుకుంటుంది. ఏడుపు వస్తున్నా ఆపుకోవడానికి ట్రై చేస్తుంది. దీప ఏడవడం చూసి శౌర్య అడిగితే మీరు నాకు అబద్దం చెప్పారు కదా అందుకే ఏడుపు వచ్చింది అంతే అంటుంది. ఈలోగా నర్సు వచ్చి డాక్టర్ గారు వస్తున్నారు బయటికి వెళ్లండి అంటుంది.
డాక్టర్ అంకులే చేసే లాస్ట్ పరీక్షలో నేను పాస్ అవుతానా అని అడుగుతుంది శౌర్య. బయటికి వచ్చి దీప ఏడుస్తుంది. అప్పుడు కార్తిక్ నీకు శౌర్య గురించి చెప్పిందెవరు అని అడిగితే జోత్స్న చెప్పింది అంటుంది దీప. జోత్స్నని ఏమి అనకండి తను చెప్పి మంచి పనే చేసింది అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News